ASBL NSL Infratech
facebook whatsapp X

ఏపీలో భారీ పెట్టుబడి.. రూ.4 వేల కోట్లతో విన్‌ఫాస్ట్‌?

ఏపీలో భారీ పెట్టుబడి.. రూ.4 వేల కోట్లతో విన్‌ఫాస్ట్‌?

విద్యుత్తు వాహనాల (ఈవీ) తయారీ సంస్థ విన్‌ఫాస్ట్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో యూనిట్‌ ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తోంది. రూ.4 వేల కోట్ల పెట్టుబడితో ప్లాంట్‌ పెట్టేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలిస్తోంది. రాయలసీమలో పరిశ్రమ ఏర్పాటు చేస్తే అవసరమైన భూమిని కేటాయించేందుకు ముఖ్యమంత్రవవి చంద్రబాబు సంసిద్ధత వెలిబుచ్చారు. వియత్నాంకు చెందిన ఈ సంస్థకు విద్యుత్తు వాహనాల తయారీలో ప్రపంచంలోనే మంచి పేరుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అంతర్జాతీయంగా పేరున్న కియా సంస్థ రాష్ట్రంలోకి అడుగుపెట్టింది. అనంతపురం జిల్లాలో వాహన తయారీ యూనిట్‌ ఏర్పాటు చేసింది. దీంతో జిల్లా రూపురేఖలే మారిపోయాయి. ఇప్పుడు ఈ విద్యుత్తు వాహన, బ్యాటరీ తయారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి వస్తే, మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుంది. అందులోనూ పెట్టుబడిదారుల్ని ఆకుట్టుకుని రాష్ట్రానికి రప్పించడంలో చంద్రబాబుకు ఎంతో అనుభవం ఉంది. 

విన్‌ఫాస్ట్‌ ప్రతిని బృందంతో చంద్రబాబు సచివాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సంస్థ సీఈఓ పామ్‌ సాన్‌ చౌ ప్రతినిధులకు వివరించారు. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో ఎంతో పేరున్న ఆ సంస్థను రాష్ట్రానికి ఆహ్వానించారు. ఈవీ, బ్యాటరీ తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని కోరారు. అవసరమైన భూమి, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విన్‌ఫాస్ట్‌ ప్రతినిధులకు చంద్రబాబు విందు ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు విన్‌ఫాస్ట్‌ ప్రతినిధులు చంద్రబాబుకు వివరించారని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ తెలిపారు. రాయితీలపై చర్చించి,  అంతా అనుకూలంగా ఉంటే, రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయమై నెల రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye
Tags :