ASBL Koncept Ambience
facebook whatsapp X

చాగంటికి సీఎం చంద్రబాబు సూచన.. వాటిని ఈ తరానికి, భవిష్యత్‌ తరాలకూ

చాగంటికి సీఎం చంద్రబాబు సూచన.. వాటిని ఈ తరానికి, భవిష్యత్‌ తరాలకూ

భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.  ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సచివాలయంలో చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు  చాగంటిని శాలువాతో సత్కరించి, వేంకటేశ్వర స్వామిని ప్రతిమను అందించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ మంచి చదువు, ఉద్యోగం భవిష్యత్‌తో పాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందని తెలిపారు. ఆ దిశగా అందరూ కృషి చేయాలని కోరారు.

స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ప్రవచనాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో మంచిని పెంచే  ప్రయత్నం చేయొచ్చు. ప్రపంచంలో మరే దేశానికి లేని ఉన్నతమైన సంస్కృతి, సంప్రదాయాలు మన సొంతం. వాటిని ఈ తరానికి, భవిష్యత్‌ తరాలకూ అందించాల్సిన అవసరం ఉంది. మారుతున్న కాలంలో అనేక అంశాలు విద్యార్థులు, యువతపై దుష్ప్రభావం చూపుతున్నాయి. నైతిక విలువల పతనానికి ఇవి కారణం అవుతున్నాయి. సుమతి`వేమన శతకాలు, నీతి కథలు, మంచి మాటలు, ప్రత్యేక క్లాసుల ద్వారా విద్యార్థులు, యువతలో విలువలు పెంచేందుకు దోహదపడతాయి. మహిళలను గౌరవించడం, పెద్దలు, తల్లిదండ్రుల మాటలకు విలువ ఇవ్వడం వంటివి యువతకు నేర్పించాలి అని చాగంటికి చంద్రబాబు సూచించారు. విద్యాశాఖలో చేపట్టబోయే కార్యక్రమాలపై ఇప్పటికే ఆ శాఖ మంత్రి నారా లోకేష్‌తో చర్చించానని చాగంటి సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

 


 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :