ASBL Koncept Ambience
facebook whatsapp X

ఈ రంగం ద్వారా మంచి ఫలితాలు : సీఎం చంద్రబాబు

ఈ రంగం ద్వారా మంచి ఫలితాలు : సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ఆహారశుద్ధి యూనిట్‌ల ఏర్పాటుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సచివాలయంలో సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలశాఖ, ఆహారశుద్ధి పరిశ్రమలపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ  ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటికి చేయూత ఇస్తుందన్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సహం అందిస్తే ఈ రంగం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. సవాళ్లతో దెబ్బతిన్న ఈ రంగాన్ని సరికొత్త విధానాల ద్వారా మళ్లీ గాడిన పెడతామని అన్నారు. రాష్ట్రంలో పెండిరగ్‌లో ఉన్న ఎంఎస్‌ఎంఈ పార్కులను త్వరితగతిన పూర్తి సౌకర్యాలు కల్పించి పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేస్తామన్నారు. భూములు కలిగిన రైతులు, ప్రైవేటు భాగస్వామ్యంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం పార్క్‌లు ఏర్పాటు చేసుకునే విధానాన్ని అమల్లోకి తేవాలని సూచించారు. రాజధానిలో రైతుల భాగస్వామ్యంతో వారికి ఎలా  లబ్ధి చేకూర్చామో అదే తరహా విధానాన్ని ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటులోను అవలంభించాలన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఏడు క్లస్టర్లను పూర్తి చేయాలన్నారు. ఎంఎస్‌ఎంఈకి క్రెడిట్‌ గ్యారెంటీ కింద రూ.100 కోట్లు కేటాయిస్తామని తెలిపారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :