గతంలో దేశంలో ఎక్కడ దొరికినా ... దాని మూలాలు ఏపీలోనే : సీఎం చంద్రబాబు
భవిష్యత్తులో ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే ఏం చేయాలో చేసి చూపిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శాసనసభలో సీఎం మాట్లాడుతూ దేశమంతా అధ్యయనం చేసి మహిళల భద్రతకు చట్టాలు చేశామన్నారు. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా లా అండ్ ఆర్డర్ ఉంటుందని స్పష్టం చేశారు. తల్లిని, చెల్లిని దూషించినా గత సీఎం పట్టించుకోలేదు. షర్మిలపై వర్రా రవీందర్‌రెడ్డి చేసిన పోస్టులు నా నోటీతో నేను చెప్పలేను. అసెంబ్లీలో ఉచ్చరించడానికి కూడా వీల్లేని విధంగా పోస్టులు పెట్టారు. వర్రా రవీందర్‌రెడ్డి పేరుతో వేరే వాళ్లు పోస్టులు పెట్టారని జగన్ అంటున్నారు. జగన్ ఇంకా అతన్ని ఎందుకు వెనకేసుకొస్తున్నారు.
అవినాష్‌రెడ్డిపై కూడా కేసు పెట్టాలని షర్మిల చెబుతున్నారు. డిప్యూటీ సీఎం, హోం మంత్రిపై కూడా సభ్య పోస్టులు పెట్టారు. ఆడబిడ్డలపై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిస్తున్నారు. గత ప్రభుత్వం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అందులో వైసీపీ వాళ్లనే ఉద్యోగులుగా నియమించారు. వారిచేత అసభ్యంగా పోస్టులు పెట్టించారు. గత ఐదేళ్లలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలోనే. గతంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడితే, టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. గతంలో గంజాయి నియంత్రణకు చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో ఏం నేరం జరిగినా, దాని వెనుక గంజాయి బ్యాచ్ ఉంటుంది. గతంలో నాసికరం మధ్యం విక్రయించడం వల్ల గంజాయికి అలవాటుపటుపడ్డారు. విద్యాసంస్థల ప్రాంగణాల్లోకి కూడా గంజాయి, డ్రగ్స్ చేరాయి. అన్ని వ్యవస్థలను కంట్రోలు చేస్తాం కానీ, గంజాయి కట్టడి చేసేందుకు సమయం పడుతుందని ఎన్నికల ముందే చెప్పాను అని అన్నారు.