ఎవరైనా ఆడపిల్లల జోలికొస్తే.. వారికి అదే చివరి రోజు
ఉచిత ఇసుకలో ఎక్కడా రాజీ లేదని, దొంగతనంగా ఇసుక వ్యాపారం చేస్తే ఊరుకునేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మద్యంలో ఇష్టానుసారం ధరలు పెంచితే సహించబోనన్నారు. బెల్ట్ షాపులు పెడితే బెల్టు తీస్తానని హెచ్చరించారు. జనవరికాల్లా ఏపీలో గుంతలు లేకుండా రోడ్లను మారుస్తామని చంద్రబాబు తెలిపారు. డ్రోన్లు పంపించి గుంతల రోడ్లను పరిశీలిస్తానన్నారు. ఎవరైనా ఆడపిల్లల జోలికొస్తే వారికి అదే చివరి రోజు అన్నారు. అఘాయిత్యం చేసి వారిని నడిరోడ్డుపై ఉరితీస్తే మిగతవారు దారికొస్తారని ఘాటుగా హెచ్చరించారు.
Tags :