కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో.. సీఎం రేవంత్రెడ్డి భేటీ
కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతాల గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా వరంగల్ ఎయిర్ పోర్టు పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. భూ సేకరణ ఎంత తొందరగా పూర్తయితే అంత త్వరగా ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు చేపడతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఎయిర్ పోర్టు నిర్మాణాలు చేపట్టాలని సీఎం ప్రతిపాదించారు. ఆయా ప్రాంతాల్లో ఎయిర్ పోర్టుల నిర్మాణాలకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని కేంద్ర రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Tags :