ASBL NSL Infratech
facebook whatsapp X

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటన వివరాలు..

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటన వివరాలు..

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌ రెడ్డి అమెరికాకు వస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితోపాటు, మంత్రులు శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్‌ అధికారులు శ్రీమతి శాంత కుమారి, చీఫ్‌ సెక్రటరీ (ఒక రాష్ట్ర సిఎస్‌ ముఖ్యమంత్రితో కలిసి ప్రయాణించడం ఇదే మొదటిసారి కావచ్చు), ఐటి అండ్‌ సి డిపార్ట్‌మెంట్‌ అధికారి శ్రీ జయేష్‌ రంజన్‌ ఐఎఎస్‌.,  ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ ఎన్నారై వ్యవహారాల ఐఎఫ్‌ఎస్‌ అధికారి డా. ఇ. విష్ణువర్ధన్‌ రెడ్డి వస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో చురుకుగా వ్యవహరిస్తూ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ కన్వీనర్‌గా నియమితులైన వై.నరేందర్‌ రెడ్డి ఈ పర్యటన ఏర్పాట్లను సమన్వయం చేస్తున్నారు. ఆగస్టు 4 నుంచి 9వ తేదీ మధ్య అమెరికాలోని వివిధ నగరాల్లో ఈ బృందం పర్యటించనున్నది. ఈ సందర్భంగా  పలు సంస్థలు, కంపెనీలు, పెట్టుబడిదారులతో మమేకమవనున్నారు. ఎంవోయూలు చేసుకోనున్నారు. పలు సంస్థల అధినేతలతో ముఖ్యమంత్రి, వారి బృందం సమావేశమై తెలంగాణలో ఉన్న అవకాశాలను వారికి వివరించి భారీగా పెట్టుబడులను సమీకరించనున్నారు.

సీఎం పర్యటన వివరాలు... 

3న హైదరాబాద్‌ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు చేరుకుంటారు. 

4న న్యూ జెర్సిలోని రాయల్‌ ఆల్బర్ట్‌ ప్యాలెస్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ముఖ్యమంత్రి, వారి బృందం మాట్లాడనున్నారు. 

5న న్యూయార్క్‌లో కాగ్నిజెంట్‌ సీఈవోతో, సిగ్నా సీనియర్‌ అధికారి, ఆర్‌సీఎం, టీబీసీ, కార్నింగ్‌, జోయిటస్‌ సంస్థల ప్రతినిధులు, ఆర్గా సీఈవో రామకృష్ణ, పీ అండ్‌ వో సంస్థ సీవోవో శైలేష్‌ జెజురికర్‌, ర్యాపిడ్‌ 7 ప్రతినిధులతో భేటీ అవుతారు.

6న పెప్సికో, హెచ్‌సీఏ ఉన్నతాధికారులతో సమావేశమైన తరువాత న్యూయార్క్‌ నుంచి వాషింగ్టన్‌ చేరుకుంటారు. ఇక్కడ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమవుతారు. అనంతరం డల్లాస్‌కు వెళ్తారు. 

7న ఛార్లెస్‌ స్క్వాబ్‌ హెడ్‌, మహాత్మాగాంధీ మెమోరియల్‌ ప్లాజా సందర్శన, ఐటీ సేవల సంస్థలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఉంటాయి. 

8న కాలిఫోర్నియాలో ట్రినెట్‌ సీఈవో, ఆరమ్‌, ఆమ్‌జెన్‌, రెనెసాస్‌, అమాట్‌ సంస్థల ప్రతినిధులతో సమావేశం, సెలెక్ట్‌ టెక్‌ యూనికార్న్స్‌ ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి, సెమీ కండక్టర్‌ రంగానికి చెందిన పలు సంస్థలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొంటారు. 

9న గూగుల్‌ సీనియర్‌ ప్రతినిధులతో భేటీ, స్టాన్‌ఫోర్డ్‌ బయోడిజైన్‌ సెంటర్‌ సందర్శన, అమెజాన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, జెడ్‌ స్కేలర్‌ సీఈవో, ఎనోవిక్స్‌, మోనార్క్‌ ట్రాక్టర్స్‌, థెర్మోఫిషర్‌ సైంటిఫిక్‌ ప్రతినిధులను కలుస్తారు. 

10న అమెరికా నుంచి బయలుదేరి 11న సియోల్‌ చేరుకుంటారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :