ASBL Koncept Ambience
facebook whatsapp X

తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. యూనివర్సిటీకి 150 ఎకరాల స్థలంతో పాటు ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్కిల్ యూనివర్సిటీకి రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీలు భాగస్వామ్యం కావాలని కోరారు.

యూనివర్సిటీ బోర్డుతో పాటు రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సచివాలయంలో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారు, పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా గారు, కో-చైర్మన్ శ్రీని రాజు గారు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు స్కిల్ యూనివర్సిటీ లో భాగస్వామ్యం పంచుకోవాలని, యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. యూనివర్సిటీలో భవనాల నిర్మాణానికి ముందుకు వచ్చిన కంపెనీలు లేదా దాతల పేర్లను ఆ భవనాలకు పెట్టాలని అధికారులకు సూచించారు.

స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఆలోచన, ఆశయాలతో పాటు పలు కీలక అంశాలను మంత్రి శ్రీధర్ బాబు గారు సమావేశంలో వివరించారు. యూనివర్సిటీలో కోర్సులు ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని యూనివర్సిటీ బోర్డు నిర్ణయించింది. దసరా పండుగ తర్వాత అక్టోబర్ నెలలో కోర్సులను ప్రారంభించనున్నట్లు సూచన ప్రాయంగా వెల్లడించింది. 

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :