ASBL NSL Infratech

టికెట్ రేట్లు పెంచాలంటే ఆ రూల్ పాటించాల్సిందే!

టికెట్ రేట్లు పెంచాలంటే ఆ రూల్ పాటించాల్సిందే!

పాన్ ఇండియా సినిమాలు, భారీ బ‌డ్జెట్ సినిమాల‌కు టికెట్ రేట్ల పెంపు ఇప్పుడు త‌ప్ప‌నిస‌రైంది. దీంతో నిర్మాత‌లు ప్ర‌భుత్వాల‌కు అభ్య‌ర్థ‌న‌లు చేసుకోవ‌డం మామూలైంది. ఎల‌క్ష‌న్స్ ముందు వ‌ర‌కు ఏపీలో ఉన‌న ఇబ్బంది రీసెంట్ గా ప్ర‌భుత్వం మార‌డంతో తొల‌గిపోయింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ విష‌యంలో ఇక‌పై నిర్మాత‌ల‌కు ఎలాంటి స‌మ‌స్యా లేదు.

అయితే ఇక‌పై తెలంగాణలో టికెట్ పెంపుకు ప‌ర్మిష‌న్ కావాలంటే దానికి ఓ రూల్ ను పెట్టాడు సీఎం రేవంత్ రెడ్డి. ఆయ‌న పెట్టిన ఈ మెలిక స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డేది కావ‌డంతో అన్ని వ‌ర్గాల నుంచి దానికి మ‌ద్దుతు ల‌భిస్తోంది. రూల్ ప్ర‌కారం ఎవ‌రైనా స‌రే డ్ర‌గ్స్, సైబ‌ర్ క్రైమ్ కు వ్య‌తిరేకంగా వాటిపై అవ‌గాహ‌న క‌లిగించేలా ఆ చిత్రంలో న‌టించిన హీరో హీరోయిన్లు మినిమం ఒక‌టిన్న‌ర నిమిషాల నిడివి క‌లిగిన వీడియోను పోలీస్ శాఖ‌కు అందించాలి.

దీని వ‌ల్ల ప్ర‌జ‌ల్లోకి త్వ‌ర‌గా సందేశం వెళ్తుంది. టికెట్స్ ఎక్కువ రేట్ కు అమ్ముకోవ‌డం బ‌డ్జెట్ రిక‌వ‌రీలో భాగ‌మే అయినా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మేలు జ‌ర‌గాల‌నే ఉద్దేశంతోనే ఈ రూల్ పెట్టాల్సి వ‌చ్చింద‌ని రేవంత్ రెడ్డి తెలిపారు. రీసెంట్ గా చిరంజీవి అలాంటి వీడియో ఒక‌టి చేశార‌ని గుర్తు చేసి మ‌రీ ఆయ‌న్ను అభినందించారు రేవంత్ రెడ్డి. కాబ‌ట్టి ఇక‌పై టికెట్ రేట్ల పెంపుకు అప్లై చేసే ముందు ఈ వీడియోను షూట్ చేసుకుని ఆ సీడీని కూడా అందిస్తే స‌రిపోతుందన్న‌మాట‌.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :