ఓంబిర్లా కుమార్తె వివాహ విందుకు ... ప్రముఖుల హాజరు
లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కుమార్తె వివాహ విందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఓంబిర్లా కుమార్తె అంజలీ బిర్లా ప్రముఖ వ్యాపారవేత్త అనీష్ రజనీల వివాహం ఈ నెల 12న జరగ్గా ఢల్లీిలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఢల్లీిలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, కాంగ్రెస్ ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు తదితరులు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మండలి చైర్మన్ కొయ్యె మోషేన్ రాజు, వైఎస్ఆర్సీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, ప్రసాద్, బాలశౌరి, ఉదయ్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.