ASBL Koncept Ambience
facebook whatsapp X

రుణాల్ని రీస్ట్రక్చర్‌ చేసే అవకాశం ఇవ్వాలి : సీఎం రేవంత్‌

రుణాల్ని రీస్ట్రక్చర్‌ చేసే అవకాశం ఇవ్వాలి : సీఎం రేవంత్‌

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటాను 50 శాతానికి పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి ఆర్థిక సంఘాన్ని కోరారు. ప్రజాభవన్‌లో 16వ ఆర్థిక సంఘం సమావేశం జరిగింది. ఆర్థిక సంఘానికి సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర పరిస్థితిని వివరించారు. తెలంగాణను ప్యూచర్‌ స్టేట్‌ గా పిలుస్తున్నామన్నారు. బలమైనా పునాదులున్నా, రాష్ట్రం ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటోందని చెప్పారు. భారీ రుణభారం రూ.6.85 లక్షల కోట్లకు చేరుకుందన్నారు. గత పదేళ్లలో మౌలిక ప్రాజెక్టులకు  భారీగా అప్పులు చేశారు. ఆదాయంలో అధికంగా రుణాల చెల్లింపులకే వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. రుణాలు, వడ్డీ చెల్లింపులు సక్రమంగా నిర్వహించాల్సి ఉంది. నిర్వహణ సరిగా లేకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం పడుతుంది. రుణ సమస్య పరిష్కారానికి తగిన సహాయం, మద్దతు ఇవ్వాలి. రుణాల్ని రీస్ట్రక్చర్‌ చేసే అవకాశం ఇవ్వాలి. రీస్ట్రక్చర్‌ చేయకపోతే అదనపు ఆర్థిక సాయం చేయాలి. తెలంగాణను  ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం. దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మా వంతు బాధ్యత నెరవేరుస్తాం అని రేవంత్‌ తెలిపారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :