ASBL Koncept Ambience
facebook whatsapp X

గులాబీ పార్టీని ఫినిష్ చేయడానికి రేవంత్ కంకణం కట్టుకున్నారా..?

గులాబీ పార్టీని ఫినిష్ చేయడానికి రేవంత్ కంకణం కట్టుకున్నారా..?

పదేళ్ల పాటు తెలంగాణను ఎదురేలేకుండా పాలించిన బీఆర్ఎస్ పార్టీ పనై పోయిందా..? మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు బయటకు వచ్చి యాక్టివ్ పాలిటిక్స్ చేయడంలేదు. కేటీఆర్, హరీశ్ రావు రాజకీయంగా పార్టీని ముందుకు నడిపేందుకు ప్రయత్నిస్తున్నా.. పెద్దగా ఫలితాన్నివ్వడం లేదా..? స్వయంగా జర్నలిస్టులతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు... ఇదే అర్థాన్ని ప్రతిఫలిస్తున్నాయి. బీఆర్ఎస్ ను ఎలా ఫినిష్ చేయాలనుకుంటున్నామన్న విషయాన్ని.. రేవంత్ పక్కాగా వివరించారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కూడా సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఎక్స్‌పెయిరీ మెడిసిన్ అంటూ మరోసారి ఎద్దేవా చేశారు. వన్ ఇయర్‌‌లో కొడుకుతో తండ్రిని ఫినిష్ చేశానన్న సీఎం రేవంత్.. ఆ తర్వాత బావతో బామ్మర్దిని కూడా ఫినిష్ చేస్తానన్నారు. ఆపై హరీష్‌ను ఎలా డీల్ చేయాలో తనకు తెలుసునన్నారు. తాను ఫుట్ బాల్ ప్లేయర్ ని అన్న సీఎం రేవంత్.. ఆటపై తనకు పూర్తిస్థాయిలో పట్టు ఉందని తెలిపారు.

దీపావళి దావత్ అలా చేస్తారు అని మాకు తెలియదన్నారు సీఎం రేవంత్. జన్వాడ ఫాంహౌస్‌లో ఏం జరగకపోతే.. రాజ్ పాకాల ఏం చేయక పోతే ఎందుకు పారిపోయారు? అంటూ సూటిగా ప్రశ్నించారు. పారిపోయిన రాజ్ పాకాల ముందస్తు బెయిల్ ఎందుకు అడిగారంటూ సీఎం ప్రశ్నించారు. ఇంటి దావత్ చేస్తే.. క్యాసినో కాయిన్స్, విదేశీ మద్యం ఎందుకు దొరికాయో చెప్పాలంటూ బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి. మూసి పునరుజ్జీవం చేసి తీరుతా : ఎవ్వరు ఎంత అడ్డుకున్న మూసి పునరుజ్జివం చేసి తీరుతానని సీఎం రేవంత్ అన్నారు. మొదటి ఫేస్ 21 కిలోమీటర్ల వరకు అభివృద్ధి చేస్తామని చెప్పారు. గండిపేట, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మొదటి ఫేస్ పనులు చేపడతామని తెలిపారు.

నెల రోజుల్లో డిజైన్లు పూర్తి అయితాయి. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తెచ్చి గండిపేటలో పోస్తామని తెలిపారు. దీనికి సంబంధించి ట్రంక్ లైన్ కోసం నవంబర్ మొదటి వారంలో టెండర్లు పిలుస్తామని రేవంత్ పేర్కొన్నారు. బాపుఘాట్ వద్ద ప్రపంచంలోనే ఎతైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. బాపుఘాట్ వద్ద బ్రిడ్జి కం బ్యారేజి నిర్మాణం చేపడతామని తెలిపారు. అక్కడ అభివృద్ధి కోసం ఆర్మీ ల్యాండ్ కూడా ఆడిగినట్టు చెప్పారు. 15 రోజుల్లో ఎస్టీపీలకు టెండర్లు పిలుస్తామన్నారు. మూసిని ఎకో ఫ్రెండ్లీ అండ్ వెజిటేరియన్ కాన్సెప్ట్‌తో అభివృద్ధి చేయడంతో పాటు మూసి వెంటా అంతర్జాతీయ యూనివర్సిటీ, గాంధీ ఐడియాలజీ సెంటర్, రీక్రియేషన్ సెంటర్,నేచర్ క్యూర్ సెంటర్‌లను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :