ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆయన అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే .. మేం నిజాలు చెబుతూనే ఉంటాం

ఆయన అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే .. మేం నిజాలు చెబుతూనే ఉంటాం

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు.  కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారం కోసం రేవంత్‌ రెడ్డి ముంబయి వెళ్లారు. అక్కడి పీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.  తెలంగాణ ప్రభుత్వం అమలు కానీ హామీలు ఇచ్చిందని మోదీ అన్నారు. తెలంగాణలో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.2 లక్షల రుణాలు మాఫీ చేశాం. 22 లక్షల మంది రైతులకు రూ.17.829 కోట్లు రుణమాఫీ చేశాం. ఇందుకు సంబంధించి వివరాలు కావాలంటే ఇవ్వడానికి మేం సిద్ధం అన్నారు.

తెలంగాణలో 10  నెలల్లోనే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. మహారాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ప్రధాని కాంగ్రెస్‌ గ్యారంటీల అమలుపై అబద్ధాలు చెబుతున్నారు. ఆయన అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే మేం నిజాలు చెబుతూనే ఉంటాం. మహారాష్ట్ర ప్రజలకు 6 గ్యారంటీల అమలుపై నిజాలు చెప్పేందుకు వచ్చా. ఇక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచాయి. నల్ల చట్టాలు తెచ్చి అదానీ, అంబానీలకు మేలు చేయాలని మోదీ భావించారు. సామాజిక న్యాయం అందించేందుకు తెలంగాణలో కులగణన చేపట్టాం. దేశ చరిత్రలో మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడికి రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులు గుజరాత్‌కు వెళ్లాయి. ఇక్కడి ప్రజలను మోసం చేసిన బీజేపీను ఎన్నికల్లో ఓడిరచాలి అని అన్నారు.
 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye Radha Spaces
Tags :