ASBL Koncept Ambience
facebook whatsapp X

తెలంగాణ బతుకమ్మ చీరలు ఏమయ్యాయి రేవంతన్నా…

తెలంగాణ బతుకమ్మ చీరలు ఏమయ్యాయి రేవంతన్నా…

తెలంగాణ రాష్ట్రంలో (Telangana state) బతుకమ్మ పండుగ (Bathukamma festival ) అంటే ఆ సందడి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఏటా ఈ పండుగ కోసం తెలంగాణ మహిళలు ఎంతగానో ఎదురు చూస్తారు. తొమ్మిది రోజులపాటు అంతా ఒకే దగ్గర చేరి బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా ఆటపాటలతో నిర్వహిస్తారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రమంతా బతుకమ్మ ఉత్సవాలు ఎంతో వైభవంగా సాగుతున్నాయి. మరో నాలుగు రోజులలో సద్దుల బతుకమ్మ (Saddula Bathukamma) కూడా వచ్చేస్తుంది.. అయితే ఈ క్రమంలో మహిళలు రేవంత్ సర్కార్ పై కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే ప్రతి సంవత్సరం బ్రతుకమ్మ పండగ వస్తుంది అంటే ప్రభుత్వం తరఫున రేషన్ కార్డులు ఉన్న మహిళలకు చీరల పంపిణీ ( Bathukamma sarees) కార్యక్రమం జరుగుతుంది. ఒక్కో మహిళకి ఒక్కో చీర కచ్చితంగా అందుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కేసీఆర్ (KCR) తప్పకుండా ఆచరిస్తున్న ఓ సంప్రదాయమని చెప్పవచ్చు. అయితే పదేళ్లుగా మహిళలకు అందుతున్న చీరలు ఈ సంవత్సరం అందుతాయా లేదా అన్న విషయంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. 

తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ కానుక అంటూ సంబరాల ప్రారంభానికి ముందే బీఆర్ఎస్ ప్రభుత్వం చీరలు అందించే. అయితే ఇప్పుడు కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం స్కీములను అమలు చేస్తున్నప్పటికీ బతుకమ్మ సారెలను మాత్రం పక్కన పెట్టేసినట్టు కనిపిస్తోంది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన చీరల పథకంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని చాలా సందర్భాలలో రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే ఈ ఏడాది నేతన్నలకు బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ అందనే లేదు. అయితే ఈ ఏడాది చీరలకు బదులుగా ప్రతి మహిళకు 500 రూపాయల చొప్పున ప్రభుత్వం తరఫున ఇస్తారు అన్న ప్రచారం జరిగింది. పోనీ అదన్న దక్కుతుంది అని భావించిన మహిళలకు పండగ ముగుస్తున్న ఇంకా ఆ ఊసు కూడా ఎత్తకపోవడం కాస్త నిరాశను కలిగిస్తుంది. దీంతో చీరలు పోయాయి.. డబ్బులు లేకుండా పోయాయి అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :