వాళ్లను నిందించడం కరెక్టేనా దేవీ?
పుష్ప2(pushpa2)కు సంబంధించిన ఈవెంట్ ఎప్పుడు జరిగినా సోషల్ మీడియాలో మారు మోగిపోతుంది. మొన్నీ మధ్య బీహార్ లోని పాట్నాలో భారీ ఈవెంట్ చేస్తే అది బ్లాక్ బస్టర్ అయింది. దాని తర్వాత నిన్న సౌత్ లో భాగంగా చెన్నైలో ఈవెంట్ ను చేశారు. ఈ ఈవెంట్ కూడా బాగా సక్సెస్ అయింది. కానీ ఈ ఈవెంట్ లో బన్నీ(Bunny)ని మించి మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్(Devi sri prasad) హైలైట్ అవడం విశేషం.
దేవీ మాటల చుట్టూ ముసురుకున్న వివాదం నిన్నటి నుంచి వార్తల్లో నానింది. స్టేజ్ మీద చాలా సరదాగా కనిపించే దేవీ, ఇంత వివాదాస్పదంగా మాట్లాడటం ఇదేనేమో. పుష్ప2 విషయంలో తనను అనవసరంగా నిందించడం, తనుండగా వేరే మ్యూజిక్ డైరెక్టర్లను ఇందులో భాగస్వాముల్ని చేసి వారితో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయించుకోవడం దేవీని బాగానే హర్ట్ చేసింది.
దేవీ బాధ సరైనదే కానీ అతను నిర్మాతలను నిందించడం ఎంతవరకు కరెక్టనేది ఆలోచించాల్సిన విషయం. ఈ సినిమా విషయంలో నిర్మాతలు మొదటినుంచి చాలానే ఇబ్బంది పడుతున్నాయి. షూటింగ్ లేటవడంతో బడ్జెట్ తడిసి మోపెడైంది. అయితే దేవీ పనితనం నచ్చక వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను ప్రాజెక్టులోకి తీసుకొచ్చింది సుకుమార్(Sukumar) అని అందరూ అంటున్న టైమ్ లో దేవీ ఇలా నిర్మాతలపై ఎటాక్ చేయడం కొందరికి రుచించడం లేదు. ఏదేమైనా పుష్ప2 విషయంలో నిర్మాతలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు.