Suriya45: సూర్య సినిమాకు మారిన సంగీత దర్శకుడు
సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటో కాస్త లేట్ గా అయినా సరే దానికి తగ్గ ఫలితం దక్కుతుందని చెప్పడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలాంటి ఓ ఉదాహరణే సాయి అభ్యంక్కర్ కెరీర్. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya), ఆర్‌జె బాలాజీ(RJ Balaji) దర్శకత్వంలో రీసెంట్ గా ఓ పాన్ ఇండియా సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఆ సినిమాకు ముందుగా అనుకున్న సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్(AR Rahman). కానీ తాజాగా ఆయన తప్పుకుని ఆ ప్లేస్ లో సాయి అభ్యంక్కర్(Sai Abhyankar) అనే 20 ఏళ్ల కుర్రాడు వచ్చి చేరాడు. ఇంత చిన్న ఏజ్ లో సూర్య సినిమాకు సంగీతం అందించడమంటే మాటలు కాదు. అయితే దీని కంటే ముందే అభ్యంక్కర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) నిర్మిస్తున్న బెంజ్(Benz) కు కూడా ఛాన్స్ అందుకున్నాడు.
యూట్యూబ్ లో సాయి అభ్యంక్కర్ సంగీతం అందించిన రెండు కచ్చి సెర, ఆశ కూడ అనే పాటలు భారీ వ్యూస్ తెచ్చుకున్నాయి. ఇవి చూసే తనకు లోకేష్ పిలిచి మరీ బెంజ్ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఏడాదిలోనే సాయి అభ్యంక్కర్ ఇవన్నీ సాధించడం చూస్తే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. ప్రస్తుతం రెహమాన్ చేతిలో 10 వరకు సినిమాలున్నాయి. ఇంత బిజీ షెడ్యూల్ లో సూర్య 45కి న్యాయం చేయలేనని భావించే రెహమాన్ ఈ సినిమాకు నో చెప్పి ఉంటాడని కొందరంటుంటే, క్రియేటివ్ డిఫరెన్స్ కూడా రీజన్ అయుండొచ్చని మరికొందరంటున్నారు.