ASBL Koncept Ambience
facebook whatsapp X

Konda Surekha : కొండా సురేఖ కామెంట్స్... డ్యామేజ్ కంట్రోల్‌లో కాంగ్రెస్..!?

Konda Surekha : కొండా సురేఖ కామెంట్స్... డ్యామేజ్ కంట్రోల్‌లో కాంగ్రెస్..!?

తెలంగాణలో మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) ఇటీవల చేసిన కామెంట్స్ (Comments) తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొందరు సినిమా తారల (Cinema Stars) జీవితాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) చెడగొట్టారని ఆమె ఆరోపించారు. సమంత – నాగచైతన్య (Samantha – naga chaitanya) విడాకులకు ఆయనే కారణమన్నారు. మరో హీరోయిన్ త్వరగా పెళ్లి చేసుకోవడానికి కూడా కేటీఆరే (KTR) బాధ్యుడన్నారు. ఇలా ఆమె చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో తీవ్ర దుమారమే రేపాయి. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ (Congress Party) నష్టనివారణ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దూకుడుపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైడ్రా (HYDRA), మూసీ (Musi) పరిరక్షణ చర్యలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై వ్యతిరేకత కనబరుస్తున్నాయి. అయినా రేవంత్ రెడ్డి మాత్రం వెనక్కు తగ్గట్లేదు. వాటిని రాజకీయం చేసేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి తప్ప మేలు చేసే ఉద్దేశం ఆ పార్టీలకు లేదని రేవంత్ మండిపడుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) .. కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు విపక్షాలకు, ప్రజలకు ఆయుధాలుగా మారాయి. అసలే హైడ్రా, మూసీ వివాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్ పార్టీకి కొండా సురేఖ మరింత డ్యామేజ్ చేశారు.

కొండా సురేఖ కామెంట్స్ ను సినిమా ఇండస్ట్రీ (Cine Industry) మొత్తం ముక్తకంఠంతో ఖండించింది. ఇండస్ట్రీ మొత్తం నాగార్జున (Akkineni Nagarjuna), సమంతలకు అండగా నిలబడింది. కొండా సురేఖ వ్యాఖ్యలను సమంత కూడా ఖండించింది. మరోవైపు కొండా సురేఖపై నాగార్జున క్రిమినల్ కేసు (Criminal Case) పెట్టారు. ఈ వ్యవహారంలో తాడేపేడో తేల్చుకునేందుకు నాగార్జున సిద్ధమయ్యారు. దీంతో అలర్ట్ అయిన కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. అయినా ఈ దుమారం మాత్రం చల్లారట్లేదు.

దీంతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు సమాచారం. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) తో ఈ అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అవసరమైతే కొండా సురేఖ చేత మంత్రిపదవికి రాజీనామా చేయించేందుకైనా వెనకాడకూడదనే ఉద్దేశంతో హైకమాండ్ (Congress High Command) ఉన్నట్టు సమాచారం. ఒకటి రెండ్రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీసీఎం భట్టివిక్రమార్క (Bhatti Vikramarka) ఢిల్లీ వెళ్లబోతున్నారు. అక్కడ కొండా సురేఖపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి కొండా సురేఖ నోటి దూల ఆమె పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :