CM Revanth: కీలక ప్రాజెక్టులకు సీఎం రేవంత్ శంకుస్థాపన.. రూ.150 కోట్లతో
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో రైజింగ్ వేడుకలు (raijing vedukalu ) నిర్వహించారు. ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్‌ఎండీఏ మైదానంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రాజెక్టులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రేటర్ (Greater) పరిధిలో రూ.150 కోట్లతో పలు సుందీకరణ పనులు, రూ.3,500 కోట్లతో రహదారి అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.16.50 కోట్లతో నిర్మించిన భూగర్భ సంపులను ప్రారంభించారు. దేశంలోనే అతిపెద్ద ఎస్టీపీ (STP)ని సీఎం ప్రారంభించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టబోయే 6 జంక్షన్ల అభివృద్ధి, 7 ఫ్లైఓవరు, అండర్ పాస్ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు భద్రత కిట్లను అందించారు.