బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డికి .. 14 రోజుల రిమాండ్
బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో నరేందర్ రెడ్డి ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు. అనంతరం న్యాయస్థానం రిమాండ్ విధించింది. లగచర్ల ఘటనలో మంగళవారం 16 మందిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు, బుధవారం మరో నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాని నిందితుడు సురేశ్ సోదరుడితో పాటు మరో ముగ్గురు ఉన్నారు.
Tags :