అమరావతిపై దుష్ప్రచారం... సీఆర్‌డీఏ వివరణ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వరదముప్పు ఉందంటూ జరుగుతున్న దుష్ప్రచారంపై సీఆర్‌డీఏ వివరణ ఇచ్చింది. వరదరహిత నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచించినట్లు తెలిపింది. వందేళ్ల వర్షపాతాన్ని పరిశీలించి టాటాకన్సల్టింగ్ ఇంజినీర్లు, నెదర్లాండ్స్ సంస్థ నివేదిక ఇచ్చిందని వెల్లడిరచింది. ఈ మేరకు సీఆర్‌డీఏ అధికారులు మీడియాకు తెలిపారు.
వరద నిర్వహణకు అమరావతిలో ప్రవహిస్తున్న వాగులను విస్తరిస్తాం. కొండవీటి వాగు, పాలవాగుల లోతు, వెడల్పు పెంచుతాం. వరద నిర్వహణ ప్రణాళిక డిజైన్‌ను సాంకేతిక కమిటీ ఆమోదించింది. రాజధాని అమరావతిలో వరద నిర్వహణ పనులకు రూ.2,062 కోట్లతో అంచనాలు రూపొందించాం. ఈ ప్రణాళికపై ప్రపంచ బ్యాంక్, ఏడీబీ సంతృప్తి చెందాయి. వరద పనులు 2019`24 మధ్య చేసి ఉంటే ఖర్చు తక్కువయ్యేది. సుమారు 25`30 శాతం తక్కువ ఖర్చుతోనే పనులు పూర్తయ్యేవి. గత ఐదేళ్లలో జరిగిన నిర్లక్ష్యాన్ని సరిదిద్దాలని నిర్ణయించుకున్నాం. వచ్చే మూడేళ్లలో వరద పనులతో పాటు నగర అభివృద్ధి చేస్తాం అని సీఆర్‌డీఏ తెలిపింది.