ASBL Koncept Ambience
facebook whatsapp X

ఇప్పటి రాజకీయాలు చాలా డిఫరెంట్.. చంద్రబాబు తోడల్లుడి సెన్సేషనల్ కామెంట్స్..

ఇప్పటి రాజకీయాలు చాలా డిఫరెంట్.. చంద్రబాబు తోడల్లుడి సెన్సేషనల్ కామెంట్స్..

మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateswararao )ప్రస్తుత రాజకీయాల గురించి తన రేంజ్ లో వైరల్ కామెంట్స్ చేశారు. ఒకప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి (Present politics) అస్సలు పొంతనలేదు అంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇప్పుడు రాజకీయాలు చాలా ఖర్చుతో కూడుకున్నవి.. ఎన్నికల్లో నిలబడాలి అంటే భారీగా ఖర్చు పెట్టుకునే సత్తా ఉండాలి అని అభిప్రాయపడ్డారు. 

అంతేకాదు గెలిచిన తర్వాత కూడా దండిగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. గతంలో రాజకీయం అంటే ఇలా ఉండేది కాదు అని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే అభ్యర్థులు కనీసం 20 కోట్లు అన్న పెట్టుకోవాల్సి వస్తుంది అని అన్నారు. గెలిస్తే మరొక 30 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని.. అంటే ఎమ్మెల్యేగా దిగాలి అంటే కనీసం 50 కోట్ల అయినా చేతిలో ఉండాల్సిందే అని విమర్శించారు.

ఒకప్పుడు రాజకీయాలు ఇలా లేవు అంటున్న వెంకటేశ్వరరావు ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ చేయకుండా ఉన్నందుకు తాను ఎంతో అదృష్టవంతుణ్ణి అని అన్నారు.
గత ఎన్నికల్లో పోటీ చేయకపోవడం పై తనకు ఎటువంటి అసంతృప్తి లేదని.. ప్రస్తుతం ఉన్న రాజకీయాలను చూసి ఎంతో సంతృప్తిగా విరమణ తీసుకున్నట్లు భావిస్తున్నానని పేర్కొన్నారు. గతంలో ఉద్యోగాలు కూడా ఎంతో సులభంగా వచ్చేవని.. ఇప్పుడు అవి కూడా రావడం లేదని ఉద్యోగం తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు.

గతంలో ఆరుసార్లు టిడిపి, కాంగ్రెస్ తరపున అసెంబ్లీకి ఎన్నికైన వెంకటేశ్వరరావు.. టిడిపి తరఫున రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. అయితే 2019 ఎన్నికల్లో పరుచూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్న వెంకటేశ్వరరావు ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్న విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఒకపక్క ఆయన తోడల్లుడు చంద్రబాబు (Chandra Babu/ తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి. సతీమణి పురందరేశ్వరి ( Daggubati Purandeswari) బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, బావ బాలకృష్ణ (Balakrishna) హిందూపురం ఎమ్మెల్యే (Hindupur MLA) , కొడుకు వరసయ్య లోకేష్ (Lokesh) మంగళగిరి ఎమ్మెల్యే. ఇంతమంది పోటీ చేసే కదా గెలిచారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత రాజకీయాలపై దగ్గుపాటి వెంకటేశ్వరరావు చేసిన కామెంట్స్ పలు రకాల ప్రశ్నలకు తావిస్తున్నాయి.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :