రివెంజ్ తో తీర్చుకోనున్న డాకు మహారాజ్
భగవంత్ కేసరి(bhagavanth Kesari) తర్వాత బాలకృష్ణ(Balakrishna) హీరోగా బాబీ(Bobby) దర్శకత్వంలో చేస్తున్న సినిమా డాకు మహారాజ్(Daku maharaj). ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. జనవరి 12న రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయడంతో దాని ప్రకారమే షూటింగ్ ను ముందుగా పూర్తి చేసే దిశగా చిత్ర యూనిట్ పనులను వేగవంతం చేసింది. రీసెంట్ గా వచ్చిన టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
అయితే ఈ సినిమా అసలు ఎలాంటి కథతో రూపొందుతుందనేది అందరికీ ఆసక్తిగానే ఉంది. తాజా సమాచారం ప్రకారం బాబీ ఈ సినిమాలో చాలా స్ట్రాంగ్ రివెంజ్ డ్రామాను రాసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే చాందిని చౌదరి(Chandini chowdary) పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుందని, ఆ టైమ్ లో బాలయ్య గెటప్, మేనరిజం చాలా కొత్తగా ఉంటాయని అంటున్నారు.
బాలయ్య(balayya) ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని కూడా అంటున్నారు. అయితే ఓ ప్రభుత్వాధికారి విచక్షణ లేకుండా విలన్ల దండు మీద పడిపోయే డాకూ మహారాజ్ గా ఎందుకు మారతాడనేదే అసలు పాయింట్ అని తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య(waltair veerayya)లో రవితేజ(raviteja) ట్రాక్ ను మించిన ఎపిసోడ్స్ డాకు మహారాజ్ లో ఉంటాయట. డాకు అనే పేరు ఎందుకు పెట్టారనే క్లారిటీ కూడా మాస్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంటుందని సమాచారం. బాలయ్య సెంటిమెంట్ సీజన్ సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాతో తమ హీరో మరో హిట్ ను ఖాతాలో వేసుకుంటాడని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు.