ASBL Koncept Ambience
facebook whatsapp X

ఘనంగా డాటా బతుకమ్మ వేడుకలు

ఘనంగా డాటా బతుకమ్మ వేడుకలు

తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధమైన బతుకమ్మ ఉత్సవాన్ని దసరా నవరాత్రి రోజులలో మహిళలు గర్వంగా జరుపుకుంటారు. వేలాది మంది పురుషులు, మహిళలు మరియు పిల్లలుఈ వేడుకల్లో పాల్గొని, తమ సంప్రదాయాన్ని చాటుకుంటూ ఉంటారు. డల్లాస్‌ ఏరియా తెలంగాణ సంఘం (డాటా) ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ దసరా పండుగలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేలాదిమంది జనంతో వేదిక జరిగిన ప్రాంతం నిండిపోయింది. భారతీయ సంప్రదాయ వస్త్రాలతో అందంగా అలంకరించు కుని, మహిళలు, పురుషులు,  మహిళలు, పిల్లలు బతుకమ్మ అడుగులు వేస్తూ, వృత్తాలలో తిరుగుతూ, గాయకుల ఉత్సాహవంతమైన స్వరాలతో, ప్రేక్షకుల ప్రోత్సాహంతో ఈ వేడుకల్లో పాల్గొన్నవారంతా సంతోషంగా కనిపించారు. 

లైవ్‌ మ్యూజిక్‌, బాణా సంచా పేల్చడం, బతుకమ్మల చుట్టూ మహిళలు ఆడుతూ పాడుతూ చేసిన కోలాటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన పాటల కచేరి హిట్టయింది. గాయనీ గాయకులు ధనుంజయ్‌, స్ఫూర్తి జితేందర్‌, హారికా నారాయణ్‌ తమ పాటలతో అందరినీ మెప్పించారు. సౌత్‌ ఫోర్క్‌ రాంచ్‌ లో జరిగిన ఈ వేడుకలకు వేలాదిమంది విజయవంతం చేయడం పట్ల డాటా ప్రెసిడెంట్‌ విక్రమ్‌ బొర్రా సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో ఎంతోమంది ప్రముఖులు, తెలుగు వాళ్ళతోపాటు తమిళులు, ఇతర భాషీయులు కూడా పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో డేటా ప్రెసిడెంట్‌ విక్రమ్‌ బొర్రా, రఘువీర్‌ రెడ్డి (ఫౌండర్‌, కోర్‌ కమిటీ), సుధీర్‌ రెడ్డి(అడ్వైజర్‌) మరియు పలువురు లీడర్షిప్‌ టీం సభ్యులు కొన్ని వారాలుగా చక్కని ప్రణాళికతో కృషి చేశారు.ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన వాలంటీర్లు, స్పాన్సర్లు, దాతలు మరియు అందమైన బతుకమ్మలను నేర్పుగా తయారు చేసిన మహిళలు మరియు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన అందరికీ డాటా టీమ్‌ ధన్యవాదాలను తెలియజేసింది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :