ASBL Koncept Ambience
facebook whatsapp X

ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో ఉన్న సైకో థ్రిల్లర్ మూవీ ఇదే..

ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో ఉన్న సైకో థ్రిల్లర్ మూవీ ఇదే..

ఓటీటీ లలో సినిమాలు రావడం ప్రారంభించాక ఇంటి వద్దన అన్ని రకాల సినిమాలను ఎంజాయ్ చేసే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. చాలామంది ఇప్పుడు  కామెడీ చిత్రాలను, హారర్ థ్రిల్లర్స్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈసారి  నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ(OTT) ప్లాట్‌ఫారమ్‌లో విడుదలైన ఓ సైకో క్రైమ్ థ్రిల్లర్ ( Physco Crime Thriller) చిత్రం అందరినీ భయపెడుతూ ఇండియాలోనే టాప్ టెన్ ట్రెండింగ్ చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఇంతకీ ఆ మూవీ ఏమిటో? ఆ స్టోరీ ఏంటో? తెలుసుకుందాం పదండి..

సెక్టార్ 36 ( Sector 36), ఈ మూవీకి ఐఎండిబి (IMDb) లో అత్యధిక రేటింగ్ కూడా వచ్చింది. ఇక స్టోరీ విషయానికి వస్తే 2006లో ఉత్తరప్రదేశ్ లోని నోయిడా ప్రాంతంలో ప్రపంచాన్ని కుదిపి వేసే ఓ యదార్ధ సంఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ భయంకరమైన సంఘటనను 'నిఠారీ’ ఘటన అని కూడా పిలుస్తారు. ఈ మూవీలో విక్రాంత్ మాస్సే, దీపక్ టోబ్రియల్, దర్శన్ జరీవాలా కీలక పాత్రలు పోషించారు. మూవీలో ప్రేమ్ సింగ్ ( Prem Singh)అనే సైకో కిల్లర్ పాత్రలో విక్రాంత్ మాస్సే అద్భుతంగా నటించారు. ఓ గొప్ప వ్యాపారవేత్త దగ్గర సర్వెంట్ గా పని చేసే ప్రేమ్ సింగ్.. తన యజమాని ఎక్కువ శాతం విదేశాలలో ఉండడం వల్ల పెద్ద బంగ్లాలో ఒంటరిగా ఉంటుంటాడు. అతను జుక్కీ అని పక్కనే ఉన్న మురికివాడలో ఉన్న పిల్లలను రాత్రిపూట కిడ్నాప్ చేసి చంపి శరీర భాగాలను మురికి కాలవలో పడేస్తాడు. 

పిల్లలు మాయమాపడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు. దర్యాప్తులో బయటపడిన సంఘటనలు భయభ్రాంతులను చేసే విధంగా ఉంటాయి. ఇప్పటివరకు మనం చూసిన సైకో చిత్రాలకు ఈ మూవీ పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ మూవీలో పోలీస్ ఇన్స్పెక్టర్ రామ్ చరణ్ పాండే పాత్రలో దీపక్ డోబ్రియాల్ పర్ఫామెన్స్ సూపర్ గా ఉంటుంది. ఓ మంచి ఎమోషనల్ కంటెంట్ తో.. చాలా సస్పెన్స్ తో ముందుకు సాగే ఈ సైకో డ్రామా ఓ పక్క భయపెడుతూనే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. మీకు సైకోథ్రిల్లర్స్ ఇష్టమైతే తప్పకుండా ఈ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్ (Netflix) లో చూడండి.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :