ASBL Koncept Ambience
facebook whatsapp X

బైడన్ ప్లేస్ లో హ్యారిస్ ?

బైడన్ ప్లేస్ లో హ్యారిస్ ?

డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష రేసులో ఉన్న బైడన్ .. ప్రస్తుతం పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయారని చెప్పొచ్చు. ముఖ్యంగా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్తి ట్రంప్ తో అట్లాంటా వేదికగా జరిగిన డిబేట్ లో పేలవమైన ప్రదర్శన కనబర్చడం.. బైడన్ కు సమస్యలు తెచ్చిపెట్టింది. మరీ ముఖ్యంగా ఇప్పుడు బైడన్ అభ్యర్థిత్వంపైనే డెమొక్రాట్లలో పెద్ద చర్చే జరుగుతోంది. తీవ్ర అనారోగ్య సమస్యలతో ఉన్న బైడన్ స్థానంలో .. డెమొక్రాట్లను గట్టెక్కించే అభ్యర్థి ఎవరా అన్న చర్చ పార్టీలోనూ కొనసాగుతోంది. అయితే ప్రస్తుతానికి ఉన్న అభ్యర్థుల్లో వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ వైపు... అత్యధిక డెమొక్రాట్లు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

వయస్సు దృష్ట్యా..

వార్థక్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న బైడన్ తో పోలిస్తే.. కమలా హ్యారిస్ వాగ్దాటి కలిగిన వ్యక్తిగా చెబుతున్నారు డెమొక్రాట్లు. ముఖ్యంగా బైడన్ వయస్సు 81 ఏళ్లు.. ట్రంప్ వయస్సు 78 కాగా.. కమలా వయస్సు 59 ఏళ్లు మాత్రమే.. అంటే వీళ్లిద్దరితో పోలిస్తే కమలా హ్యారిస్ .. ఆరోగ్యపరంగా, వయస్సు పరంగా యాక్టివ్ రోల్ పోషిస్తారు. దీంతో బైడన్ స్థానంలో కమలాను దించితే .. యువత, మధ్యతరగతి వయస్సు వారిని ఆకట్టుకోవచ్చని డెమొక్రాట్లు భావిస్తున్నారు.

పాపులారిటీలోనూ..

ఇక ట్రంప్ కు, బైడన్ కు మధ్య పాపులారిటీ కూడా ఓ సమస్యగా చెప్పవచ్చు. గతంలో జరిగిన ఓ సర్వేలో ట్రంప్ నకు 49 శాతం మంది మద్దతివ్వగా బైడన్ కు 43 శాతం మంది మాత్రమే మద్దతుగా నిలుస్తున్నారు. అదే ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య పాపులారిటీపై సర్వే జరగ్గా ట్రంప్ నకు 45 శాతం మంది, కమలాకు 43 శాతం మంది మద్దతిచ్చినట్లు తేలింది . అంటే ఇది స్వల్పంగా చెప్పవచ్చు. దీంతో కమలాను అభ్యర్థిగా ప్రకటిస్తే మళ్లీ డెమొక్రాట్లు అధికారంలోకి రావొచ్చని అంచనా వేస్తున్నారు.

మరో ముఖ్య విషయం కమలా హ్యారిస్.. భారతీయ మూలాలు కలిగిన వ్యక్తి. ఆమె వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సమయంలో భారతదేశంలోని ఆమె పూర్వికుల స్వస్థలంలో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అంటే హ్యారిస్ కు భారతీయ అమెరికన్ల నుంచి మద్దతు ఉండే అవకాశముంది. అదీ కాక... ఆమె నల్లజాతీయురాలు.. ఈపదవికి ఎన్నికైతే .. తొలి నల్లజాతీయ అధ్యక్షరాలిగా రికార్డ్ సృష్టించే అవకాశముంది. దీంతో నల్లజాతీయుల ఓట్లు కూడా ఈమెకు పడే అవకాశాలున్నాయని డెమొక్రాట్లు విశ్వసిస్తున్నారు.

2020 నుంచి బైడన్-కమలా హ్యారిస్ ద్వయం అమెరికా పాలనను నిర్వహిస్తోంది. పాలనా వ్యవహారాల్లోనూ కమలా అనుభవం గడించారు. దీంతో ఈ అనుభవం కూాడా తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారు డెమొక్రాట్లు. మరోవైపు బైడన్ తనంతట తాను విరమించుకుంటేనే.. కమలాకు మద్దతుగా నిలుస్తామని పలువురు సీనియర్ సభ్యులు చెబుతుండడం గమనార్హం.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :