ASBL Koncept Ambience
facebook whatsapp X

వారికి మెరుగైన ప్యాకేజీతో పాటు.. పరిశ్రమలో ఉద్యోగాలు : భట్టి

వారికి మెరుగైన ప్యాకేజీతో పాటు.. పరిశ్రమలో ఉద్యోగాలు :  భట్టి

వెనుకబడిన కొడంగల్‌ను అభివృద్ధి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధి సాధిస్తే తప్ప ప్రపంచంతో పోటీ పడలేమన్నారు. పరిశ్రమలు రావాలంటే భూ సేకరణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. పరిశ్రమలు పెద్ద ఎత్తున తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. భూమి  కోల్పోతున్న రైతుల బాధ మాకు తెలుసు. రైతుల బాధను ఇందిరమ్మ ప్రభుత్వం అర్థం చేసుకుంది. భూమి కోల్పోతున్న వారికి మెరుగైన ప్యాకేజీతో పాటు పరిశ్రమలో ఉద్యోగాలు కల్పిస్తాం. ఇళ్లు కోల్పోతున్న వారికి మంచి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇస్తున్నాం.

కావాలనే కుట్రపూరితంగా కలెక్టర్‌పై బీఆర్‌ఎస్‌ శ్రేణులు దాడి చేశాయి. అమాయక గిరిజనులను రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పారు. కలెక్టర్‌, అధికారులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడి సమస్యకు పరిష్కారం కాదు. కలెక్టర్‌తో చర్చించి పరిష్కరించుకోవాలి.ఇందిరమ్మ రాజ్యంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. రాష్ట్రంలో పరిశ్రమలు రావడం బీఆర్‌ఎస్‌కు ఇష్టం లేదా? ఇది బాధ్యత కలిగిన ప్రతిపక్షం చేయాల్సిన పని కాదు. ప్రాజెక్టుల కోసం మీరు చాలా భూసేకరణ చేశారు. ఏనాడూ మేం కాదనలేదు. కలెక్టర్‌పై దాడి చేయిస్తే వెనక్కి తగ్గుతాం అనుకుంటున్నారా? అభివృద్ధే మా లక్ష్యం. అధికారులపై దాడి చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయి. మీ కోసం అమాయక ప్రజలు నష్టపోవాలా? ఉద్యమ సమయంలో కూడా ప్రజలను రెచ్చగొట్టి ప్రాణాలు కోల్పోయేలా చేశారు అని విమర్శించారు.
 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye Radha Spaces
Tags :