వారు చేసిన తప్పులు .. మేం సరిదిద్దాల్సి వస్తోంది
ప్రతి ఒక్కరికీ రక్షిత మంచినీరు ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్‌తో పవన్ సమావేశమైయ్యారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ నిధులను పెంచాలని కోరినట్లు తెలిపారు. క్షేత్రస్థాయి పర్యటనలో నీటి సమస్యలు తమ దృష్టికి వచ్చాయని అన్నారు. కొన్నిచోట్ల పైపు డిజైన్లలో లోపాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. గత ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా తీసుకున్న నిర్ణయాలు, తప్పులు తమకు వారసత్వంగా వచ్చాయని, వాటిని తాము సరిదిద్దాల్సి వస్తోందన్నారు.
Tags :