మాది మంచి ప్రభుత్వమే కానీ .. మెతక ప్రభుత్వం కాదు
దీపం 2.0 కేవలం వంటింట్లో వెలుగు కోసం మాత్రమే కాదు. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఏలూరు జిల్లా జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడారు. ప్రజలు మాపై భరోసాతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా చేసి మాపై ఎంతో బాధ్యత పెట్టారు. వైసీపీ చేసిన దోపిడీ కారణంగా అనేక ఇబ్బందులు తలెత్తయి. వైసీపీను ప్రజలు తరిమికొట్టినా, కేవలం 11 సీట్లకే పరిమితమైనా వారి నోళ్లు ఆగడం లేదు. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. సామాజిక మాధ్యమాల ద్వారా ఏడి పడితే అది మాట్లాడుతాం అంటే మాత్రం చూస్తు ఊరుకోం. మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని వైసీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలి. సోషల్ మీడియాలో ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టే విధంగా పోస్టులు పెడుతున్నారు. ప్రభుత్వం ప్రతి విషయాన్ని గమనిస్తోంది. ఆడబిడ్డల భద్రత విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటాం అని అన్నారు.