ASBL Koncept Ambience
facebook whatsapp X

దేవ‌ర‌2 మొద‌లయ్యేదెప్పుడంటే..?

దేవ‌ర‌2 మొద‌లయ్యేదెప్పుడంటే..?

దేవర(Devara) సినిమా ఒడిదుడుకుల‌ను ఎదుర్కొని స‌క్సెస్ దిశ‌గా ప్ర‌యాణిస్తుంది. వాస్త‌వానికి దేవ‌ర మొద‌టి రోజు టాక్ చూసి సినిమా ఈ రేంజ్ లో ఆడుతుంద‌నుకోలేదు. అయితే సినిమా చూసిన‌వాళ్లంతా బాలేదు అనే స్టేట్‌మెంట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో దేవ‌ర‌ మొద‌టి నుంచి యావ‌రేజ్ టాక్ తోనే నెట్టుకొచ్చింది. యావ‌రేజ్ టాక్ తో మొద‌లైన ఈ సినిమాకు రిలీజ్ టైమ్, త‌ర్వాత ద‌స‌రా సెల‌వులు క‌లిసిరావ‌డంతో హిట్ గా మారింది.

ఇప్ప‌టికే దేవ‌ర బ్రేక్ ఈవెన్ అయింది. దేవ‌ర‌కు పాజిటివ్ రిజ‌ల్ట్ రావ‌డంతో దేవ‌ర‌2 ఉంటుందా ఉండ‌దా అనే విష‌యంలో ఉన్న అనుమానాలు మొత్తం తొలగిపోయాయి. దేవ‌ర‌కు కొన‌సాగింపుగా దేవ‌ర‌2(Devara2) క‌చ్ఛితంగా ఉంటుంద‌ని క్లారిటీ వ‌చ్చేసింది. మ‌రి ఎప్పుడు దేవ‌ర‌2 ఉంటుంద‌నేది ఇప్పుడు అస‌లు ప్ర‌శ్న‌.

దేవ‌ర‌2 ను ఎప్పుడు మొద‌లుపెట్టాల‌నే విష‌యంలో మేక‌ర్స్ ఓ అంచ‌నాల‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. వచ్చే ఏడాది చివ‌ర్లో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి ఆ త‌ర్వాత మ‌రో ఏడాదికి అంటే ద‌స‌రా లేదా క్రిస్మ‌స్ నాటికి సినిమాను రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. అయితే దేవ‌ర‌2కు టెక్నిక‌ల్ విభాగంలో కొన్ని మార్పులుండే ఛాన్సున్న‌ట్లు స‌మాచారం. సినిమా మొద‌లుపెట్టే నాటికి టెక్నీషియ‌న్ల వీలును బ‌ట్టి సెలెక్ట్ చేసుకుంటార‌ట‌. ఈలోగా ఎన్టీఆర్(NTR), వార్2(War2) మ‌రియు ప్ర‌శాంత్ నీల్(Prasanth Neel) సినిమాల‌ను పూర్తి చేయ‌నున్నాడు.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :