ASBL Koncept Ambience
facebook whatsapp X

దేవ‌ర హైప్ త‌గ్గితేనే బెట‌ర్

దేవ‌ర హైప్ త‌గ్గితేనే బెట‌ర్

ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్ లో వ‌స్తోన్న దేవ‌ర మీద ముందు నుంచి మంచి అంచ‌నాలే ఉన్నాఇ. కానీ తాజాగా ట్రైల‌ర్ రిలీజ్ త‌ర్వాత మాత్రం దేవ‌రపై అంచ‌నాలు కాస్త తగ్గాయి. ఆచార్య మూవీతో పోలికలు క‌నిపించ‌డం, క‌థ రొటీన్ గా ఉండ‌టం పెద్ద మైన‌స్ అయ్యాయి. దీంతో దేవ‌రను ఆడియ‌న్స్ చూసే కోణం పూర్తిగా మారిపోయింది.

మొన్న‌టివ‌ర‌కు దేవ‌ర క‌చ్ఛితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌న్న వారు కూడా ఆ రేంజ్ హిట్ అవ‌దేమో అంటున్నారు. అయితే ఓ విధంగా చూసుకుంటే దేవ‌ర‌పై అంచ‌నాలు త‌గ్గ‌డం ఒకందుకు మంచిదే. ఈ సినిమాకు అవ‌స‌రానికి మించిన హైప్ ఇప్ప‌టికే వ‌చ్చేసింది. దేవ‌ర టాలీవుడ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని క‌ళ్యాణ్ రామ్ చేసిన కామెంట్ వ‌ల్ల అంద‌రూ దీని గురించి బాగా ఊహించుకుంటున్నారు.

మ‌రీ ఎక్కువ అంచ‌నాల‌తో సినిమా చూసిన‌ప్పుడు అదెంత బాగున్నా నిరాశ ప‌డ‌టం స‌హ‌జం. పెద్ద సినిమాల‌కు ఈ హైపే పెద్ద మైన‌స్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో ట్రైల‌ర్ లాంచ్ త‌ర్వాత అంచ‌నాలు త‌గ్గడం వ‌ల్ల ఆడియ‌న్స్ పెద్ద‌గా హోప్ లేకుండా సినిమా చూస్తారు. దీంతో సినిమా కాస్త బావున్నా ఆడియ‌న్స్ కు మంచి ఫీలింగే క‌లుగుతుంది. ఈ యాంగిల్ లో దేవ‌ర మీద రిలీజ్ కు ముందే హైప్ త‌గ్గ‌డం మంచిదే అవుతుంది.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :