అమెరికాలో దేవర ప్రభంజనం
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కచ్చితంగా దేవర మూవీ వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కొరటాల శివ ఈ చిత్రాన్ని చాలా ఎఫర్ట్స్ పెట్టి రెడీ చేస్తున్నారు. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఇదిలా ఉంటే తాజాగా దేవర చిత్రం మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓవర్‌సీస్‌లో ప్రీసేల్ టికెట్ బుక్సింగ్స్‌ను ప్రారంభించారు. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో విదేశాల్లో ముందస్తు టికెట్ బుకింగ్స్ ప్రారంభించగా హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడు పోతున్నాయి. ఈ సినిమా ప్రీ బుకింగ్స్ ఏకంగా వన్ మిలియన్ దాటేయడం విశేషం. దీంతో నార్త్ అమెరికన్ బాక్సాఫీస్‌లో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్ ద్వారానే వన్ మిలియన్ మార్క్‌ను చేరిన సినిమాగా ‘దేవర నిలిచింది. కాగా ఈ సినిమాకు సంబంధించి కనీసం ట్రైలర్ కూడా రాకముందే సినిమా టికెట్స్ ఈ స్థాయిలో అమ్ముడుపోవడం చూస్తుంటే దేవర కోసం ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థమవుతోంది.
ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన సాంగ్స్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాని హైవోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా దేవర చిత్రం కథని చెప్పబోతున్నారు. దేవర సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటించారు. ఆయన క్యారెక్టర్ కూడా చాలా పవర్‌ఫుల్ గా ఉండబోతోందని టీజర్ తో స్పష్టం అయ్యింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్ మధ్య వచ్చే పోరాట ఘట్టాలు చాలా అద్భుతంగా ఉంటాయంట. క్లైమాక్స్ ఎపిసోడ్ లో అయితే ఇద్దరి మధ్య ముష్టియుద్ధం ఉంటుందంట. ఈ సీన్ చాలా పవర్‌ఫుల్ గా ఉండబోతోందనే మాట వినిపిస్తోంది. క్లైమాక్స్ ఫైట్‌లో ఎన్టీఆర్ షర్టు లేకుండా కనిపిస్తాడంట. మల్ల యుద్ధం తరహాలో ఈ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందంట. ఈ ప్రచారం వాస్తవం అయితే మాత్రం సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోతాయి. ఈ సీన్ చూసిన తర్వాత ఫ్యాన్స్ కి పూనకాలు రావడం గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు అంటున్నారు. గతంలో టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ ఒక సాంగ్‌లో షర్టు లేకుండా కనిపించారు. అరవింద సమేత లో కూడా ఫిట్నెస్‌తో స్టన్ అయ్యేలా కనిపిం చాడు. ఇక దేవర సినిమాలో అంతకుమించి అనేలా క్లైమాక్స్ ఫైట్ షర్టు లేకుండా కండలు తిరిగిన శరీరంతో ఎన్టీఆర్ కనిపిస్తాడనే మాట వినిపిస్తోంది.
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వరల్డ్ వైడ్‌గా 350-400 కోట్ల మధ్యలో బిజినెస్ జరిగిందని టాక్. జాన్వీ కపూర్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది. సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్స్‌లో జాన్వీ కపూర్ గ్లామర్ షో ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది.