ASBL Koncept Ambience
facebook whatsapp X

దేవ‌రకు ఆ రెండు సెంటిమెంట్లు

దేవ‌రకు ఆ రెండు సెంటిమెంట్లు

ఎన్టీఆర్, కొర‌టాల శివ క‌ల‌యిక‌లో తెర‌కెక్కిన దేవ‌ర సినిమా ఈ నెల 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆరేళ్ల త‌ర్వాత ఎన్టీఆర్ నుంచి సోలోగా వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా దేవ‌ర కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు రిలీజైన కంటెంట్ సినిమాపై హైప్ ను మ‌రింత పెంచింది. ఈ నేప‌థ్యంలోనే నార్త్ అమెరికాలో దేవ‌ర‌కు భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జ‌రుగుతున్నాయి.

దేవ‌ర‌లో ఎన్టీఆర్ డ్యూయ‌ల్ రోల్ లో క‌నిపించ‌నున్నాడు. సినిమాలో ఎవ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ను కొర‌టాల పెట్టాడ‌ని, ఆ ట్విస్ట్ అంద‌ర్నీ క‌చ్ఛితంగా స‌ర్‌ప్రైజ్ చేస్తుంద‌ని యూనిట్ స‌భ్యులంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీలైంది. ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చిన స్టూడెంట్ నెం.1 కూడా సెప్టెంబ‌ర్ 27నే రిలీజ్ అయింది.

2001లో రిలీజైన స్టూడెంట్ నెం.1 ఎన్టీఆర్ కు మంచి హిట్ ను అందించింది. ఇప్పుడు మ‌ళ్లీ 23 ఏళ్ల త‌ర్వాత అదే డేట్ కు ఎన్టీఆర్ మొద‌టి సోలో పాన్ ఇండియా మూవీగా దేవ‌ర రిలీజ‌వుతోంది. స్టూడెంట్ నెం.1 సెంటిమెంట్ వ‌ర్కవుట్ అయితే దేవ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ అవ‌డం ఖాయ‌మంటున్నారు ఫ్యాన్స్. అంతేకాదు దేవ‌ర‌1 ఎన్టీఆర్ కు ఎంతో సెంటిమెంట్ అయిన తొమ్మిదో నెల‌లో రిలీజ‌వ‌డం, డేట్ కూడా 27 అంటే మొత్తం క‌లిపితే 9 వ‌చ్చేలా రిలీజ‌వ‌డం చూస్తుంటే ఎన్టీఆర్ కు ఈ రెండు సెంటిమెంట్స్ మ‌రో హిట్ ను త‌న ఖాతాలో వేసేట్లున్నాయి.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :