ASBL NSL Infratech
facebook whatsapp X

స్పీడు పెంచాలి దేవ‌ర‌

స్పీడు పెంచాలి దేవ‌ర‌

అర‌వింద స‌మేత వీర రాఘ‌వ త‌ర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా చేస్తున్న సినిమా దేవ‌ర‌. మ‌ధ్య‌లో ఆర్ఆర్ఆర్ మల్టీస్టార‌ర్ కావ‌డంతో సోలో మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో వెయిట్ చేస్తున్నారు. దేవ‌ర రెండు భాగాలుగా రానున్న విష‌యం తెలిసిందే. దేవ‌ర మొద‌టి భాగం సెప్టెంబ‌ర్ 27న భారీ అంచ‌నాల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

అంటే రిలీజ్ కు 60 రోజులే ఉంది. ఎంత పెద్ద స్టార్ అయిన‌ప్ప‌టికీ సినిమాకు ప్ర‌మోష‌న్స్ ఎంతో అవ‌స‌రం. దేవ‌ర రిలీజ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్స్ స్పీడ్ పెంచాల్సిన అవ‌సరం చాలా ఉంది. సినిమాకు బ‌జ్ పెంచ‌డానికి ర‌క‌ర‌కాల ప‌బ్లిసిటీ స్టంట్స్ చేయాలి. ప్ర‌మోష‌న‌ల్ ప్లాన్స్ ఎప్ప‌టిక‌ప్పుడు మార్చుతూ సినిమాకు హైప్ క్రియేట్ చేయాలి.
 
దేవ‌ర త‌ర్వాత రెండు వారాల‌కు రానున్న కంగువ సినిమాకు మేక‌ర్స్ చాలా అగ్రెస్సివ్ స్ట్రాట‌జీని వాడబోతున్నట్లు టాక్. కేర‌ళ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో మూడో వారం దేవ‌ర‌కు థియేట‌ర్లు కంటిన్యూ అవ‌డం క‌ష్టం కాబ‌ట్టి ముందు రెండు వారాల్లోనే కుదిరినంత వ‌సూలు చేయాలి. కంగువ‌కు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ రిలీజ్ ద‌క్క‌నున్న నేప‌థ్యంలో దేవ‌ర నిర్మాతలు ప్ర‌మోష‌న్స్ విష‌యంలో జాగ్ర‌త్త వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే న‌ష్టం వాటిల్లడం ఖాయం.
 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :