ASBL Koncept Ambience
facebook whatsapp X

దేవ‌ర‌కు పోటీగా హాలీవుడ్ మూవీ

దేవ‌ర‌కు పోటీగా హాలీవుడ్ మూవీ

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొర‌టాల కాంబినేష‌న్లో వ‌స్తున్న దేవ‌ర ఫ‌స్ట్ పార్ట్ సెప్టెంబ‌ర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో దేవ‌ర‌పై భారీ అంచ‌నాలున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ‌వుతున్న ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంటే వ‌సూళ్ల‌తో బాక్సాఫీస్ షేక్ అవ‌డం ఖాయం.

అయితే ఈ సినిమాకు ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి పోటీ లేద‌నుకున్నారు. ఇలాంటి టైమ్ లో నార్త్ నుంచి దేవ‌ర‌కు గ‌ట్టి పోటీ ఎదుర‌య్యే ఛాన్స్ క‌నిపిస్తోంది. అక్టోబ‌ర్ 4న జోక‌ర్2 భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ కానుంది. జోక‌ర్ ఫ్రాంచైజీకి ఇండియాలో చాలా పెద్ద ఫాలోయింగే ఉంది. మొద‌టి భాగం జోక‌ర్ ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది.

అప్ప‌ట్నుంచి నార్త్ ఆడియ‌న్స్ లో జోక‌ర్ ఓ బ్రాండ్ సినిమాగా మారింది. ఈ నేప‌థ్యంలో భారీ హైప్ తో రిలీజ‌వుతున్న జోక‌ర్2 టార్గెట్ రూ.150 కోట్ల పైనే ఉంటుంది. దీంతో ఈ ఎఫెక్ట్ దేవ‌రపై ప‌డే అవ‌కాశ‌ముంటుంద‌ని సందేహాలున్నాయి. అయితే అప్ప‌టికే దేవ‌ర రిలీజై వారం అయిపోతుంది కాబ‌ట్టి ఈలోపే దేవ‌ర మ్యాగ్జిమం క‌లెక్ట్ చేసేస్తుంది. త‌ర్వాత వ‌చ్చిన జోక‌ర్2 హిట్ అయితే మాత్రం దేవ‌ర వ‌సూళ్ల‌పై కొంత ప్ర‌భావమైతే క‌చ్ఛితంగా చూపిస్తుంది.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :