ASBL Koncept Ambience
facebook whatsapp X

దేవ‌ర ఈవెంట్‌కు గెస్ట్ ఎవ‌రంటే..?

దేవ‌ర ఈవెంట్‌కు గెస్ట్ ఎవ‌రంటే..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా వ‌స్తోన్న దేవ‌ర సినిమా మ‌రో 13 రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ కానున్న ఈ సినిమా స‌రికొత్త రికార్డుల‌ను సృష్టిస్తుంద‌ని ఫ్యాన్స్ ఎంతో న‌మ్మ‌కంగా ఉన్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజైన పాట‌ల‌కు, ట్రైల‌ర్ కు ఆడియ‌న్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది.

ట్రైల‌ర్ పై కొంద‌రు నెగిటివ్ గా ఉన్న‌ప్ప‌టికీ రిలీజ్ నాటికి ఆ నెగిటివిటీ అంతా పోతుంద‌ని ఫ్యాన్స్ చాలా ధీమాగా ఉన్నారు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డ‌టంతో మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్ ను వేగ‌వంతం చేశారు. ఎన్టీఆర్ ఆల్రెడీ ముంబై మీడియాకు ఇంట‌ర్వ్యూలిస్తూ బిజీగా ఉన్నాడు. తెలుగులో విశ్వ‌క్సేన్, సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌తో స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూని రికార్డు చేశారు.

ఇది కాకుండా అల్లు అర్జున్ తో మ‌రో స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ ఉండ‌బోతుందంటున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 21 లేదా 22న నిర్వ‌హించే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ కు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబును చీఫ్ గెస్టుగా పిల‌వాల‌ని మేక‌ర్స్ అనుకుంటున్నార‌ట‌. మ‌హేష్ తో అటు ఎన్టీఆర్‌కు, ఇటు కొర‌టాల‌కు మంచి అనుబంధ‌మే ఉంది. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ క‌చ్ఛితంగా దేవ‌ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వ‌స్తాడ‌ని అంద‌రూ అనుకుంటున్నారు. అస‌లే రాజ‌మౌళి మ‌హేష్ ను ఎక్క‌డికి పంప‌డం లేదంటున్న త‌రుణంలో మ‌రి ఇదెంత వ‌ర‌కు కుదురుతుందో చూడాలి.  

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :