ASBL Koncept Ambience
facebook whatsapp X

దేవ‌ర‌1 ట్రైల‌ర్‌కు డేట్ ఫిక్స్

దేవ‌ర‌1 ట్రైల‌ర్‌కు డేట్ ఫిక్స్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న దేవ‌ర‌1 ఈ నెల 27న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ అంచ‌నాల‌తో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ స‌నిమా బిజినెస్ క్లోజ్ అయింద‌ని, ఈ సినిమా త‌మ‌కు భారీ లాభాల‌నిస్తుంద‌ని బ‌య్య‌ర్లు ఎంతో న‌మ్మ‌కంగా ఉన్నారు.

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి వ‌చ్చిన మూడు సాంగ్స్ కు ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. టీజ‌ర్‌కు కూడా ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చింది. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ ను వేగ‌వంతం చేయాల‌ని డిసైడైంది. ఈ నేప‌థ్యంలోనే దేవ‌ర‌1 ట్రైల‌ర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

దేవ‌ర‌1 ట్రైల‌ర్‌ను సెప్టెంబ‌ర్ 10న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ఇన్ సైడ్ టాక్. అతి త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది. ట్రైల‌ర్ రిలీజ్ ను ఈవెంట్ గా నిర్వ‌హించి అప్ప‌ట్నుంచి ప్ర‌మోష‌న్స్ ను ఫుల్ స్పీడ్ చేయ‌నున్నారు. రిలీజ్ కు రెండు వారాల ముందు నుంచే ఎన్టీఆర్, జాన్వీ, సైఫ్ ప్ర‌మోష‌న్స్ కు రెడీ అవుతార‌ని, అన్ని రాష్ట్రాలు తిరిగి దేవ‌ర‌ను ప్ర‌మోట్ చేస్తార‌ని ఇప్ప‌టికే దానికి సంబంధించిన ప్ర‌మోష‌న్స్ క్యాలెండ‌ర్ రెడీ అయింద‌ని యూనిట్ స‌భ్యులు చెప్తున్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :