ASBL Koncept Ambience
facebook whatsapp X

దేవ‌ర‌2 వ‌చ్చేద‌ప్పుడేనా?

దేవ‌ర‌2 వ‌చ్చేద‌ప్పుడేనా?

ఎన్టీఆర్(NTR) ఫ్యాన్స్ ఎంతో కాలంగా వెయిట్ చేసిన దేవ‌ర(Devara) గ‌త వార‌మే రిలీజై మిక్డ్స్ టాక్ తోనే మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతోంది. వీకెండ్ త‌ర్వాత దేవ‌ర క‌లెక్ష‌న్స్ ఎక్కువ‌గానే డ్రాప్ అయిన‌ప్ప‌టికీ గాంధీ జ‌యంతి, ద‌స‌రా సెల‌వులు క‌లిసి రావ‌డంతో ఈ సినిమా బాక్సాఫీస్ గండాన్నిఈజీగానే దాటేస్తుంద‌నుకుంటున్నారు.

దేవ‌ర‌1(Devara1) క‌థ అయిపోయింది. ఇప్పుడు అంద‌రి దృష్టి దేవ‌ర‌2(Devara2) పైనే ఉంది. మామూలుగా ఏదైనా సినిమాను రెండు భాగాలుగా చేస్తున్నప్పుడు సెకండ్ పార్ట్ షూటింగ్ కూడా కొంత భాగం వ‌ర‌కు చేస్తారు. కానీ దేవ‌ర విష‌యంలో సెకండ్ పార్ట్ షూటింగ్ ఇంకా మొద‌లుకాలేద‌ని స‌మాచారం. దీంతో కొత్త‌గా మ‌రో సినిమాను చేసిన‌ట్లే అన్నీ మొద‌టి నుంచి చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

ప్ర‌స్తుతం తార‌క్ వార్2(War2), ప్ర‌శాంత్ నీల్(Prasanth Neel) సినిమాలు క‌మిట్ అయి ఉన్నాడు కాబ‌ట్టి అవి పూర్తయ్యే వ‌ర‌కు దేవ‌ర‌2కు డేట్స్ ఇవ్వ‌లేడు. దేవ‌ర రిజ‌ల్ట్ తేడా కొడితే దేవ‌ర‌2ను ప‌క్క‌న పెట్టేవాడు కానీ మంచి ఫ‌లితమే రావ‌డంతో దేవ‌ర పార్ట్2 ఆగిపోయే అవ‌కాశం ఏ మాత్రం లేదు. తార‌క్(Tarak) ఎలాగూ ఇప్పుడే ఫ్రీ అవ‌డు కాబ‌ట్టి కొర‌టాల ఈ గ్యాప్ లో మ‌రో సినిమా చేసి దాని త‌ర్వాత దేవ‌ర‌2 చేసే ఛాన్సుంది. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే 2027 లేదా 2028లో దేవ‌ర‌2 రిలీజ్ అయ్యే అవ‌కాశాలున్నాయి.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :