పుష్ప2 నిర్మాతలకు దేవీశ్రీ చురకలు
పుష్ప2(pushp2) బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరే వారికి వెళ్లిన నేపథ్యంలో చెన్నైలో జరిగే కిస్సిక్(Kissik) సాంగ్ లాంచ్ ఈవెంట్ లో దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri prasad) ఎలా రెస్పాండ్ అవుతారో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. దానికి తగ్గట్టే దేవీ ఈ ఈవెంట్ లో నిర్మాతలపై చాలా స్మూత్ గా చురకలు అంటించాడు. ఏదైనా మనం అడిగి తీసుకోవాలని, అడగకుండా ఎవరూ ఏదీ ఇవ్వరని దేవీ అన్నాడు.
నిర్మాతల దగ్గర పేమెంట్ అయినా, స్క్రీన్ పై దక్కాల్సిన క్రెడిట్ అయినా ఏదైనా అడిగితేనే వస్తుందన్నాడు. దేవీ మాటలకు ఎన్నో అర్థాలొస్తాయి. ఫలానా టైమ్ కు బీజీఎమ్ కావాలని తనను అడక్కపోవడం వల్లే తప్పుకోవాల్సి వచ్చిందా? తనను నిర్మాతలు అడగలేదా లేక ఎందుకు బీజీఎం ఇంకొంకరికి ఇస్తున్నారని తనే నిర్మాతలను అడగలేదా లదా ఇంత ప్రెజర్ తో వర్క్ చేస్తే క్వాలిటీ దెబ్బ తింటుందని తనే తప్పుకున్నాడా తెలియదు కానీ దేవీ మాత్రం నిర్మాత రవిపై డైరెక్ట్ పంచ్ వేశాడు.
అంతేకాదు, నిర్మాత రవి(Producer Ravi)ని ఉద్దేశించి తనమీద రవి గారికి ప్రేమతో పాటూ కంప్లయింట్స్ కూడా ఎక్కువని, టైమ్ కు చెప్పినవి ఇవ్వలేదని ఫీలవుతారని స్టేజ్ మీద చెప్తూ ఈవెంట్ కు లేట్ గా రావడానికి గల కారణాన్ని కూడా తనదైన రీతిలో వివరించాడు. మొత్తానికి దేవీ చాలా కూల్ గా తన మాటలను పేల్చాడు. ఇక కిసిక్కు సాంగ్ వింటుంటే చార్ట్‌బస్టర్ అయ్యేలా ఉంది.