ASBL Koncept Ambience
facebook whatsapp X

మామ‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న అల్లుడు

మామ‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న అల్లుడు

కోలీవుడ్ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్(Superstar Rajinikanth) ఖాతాలో మంచి బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన జైల‌ర్(jailer) కు సీక్వెల్ గా జైల‌ర్2(Jailer2) కు సంబంధించిన స్క్రిప్ట్ ను డైరెక్ట‌ర్ నెల్స‌న్ దిలీప్ కుమార్(Nelson Dileep Kumar) రెడీ చేస్తున్నాడు. రజినీ కూలీ షూటింగ్ లో బిజీగా ఉండ‌టంతో ఇంకా చాలా టైమ్ ఉన్న నేప‌థ్యంలో జైల‌ర్2 స్క్రిప్ట్ కు మెరుగులు దిద్దే ప‌నిలో బిజీగా ఉన్నాడు నెల్స‌న్.

అయితే ఈ సినిమాలో ఓ అరుదైన కాంబినేష‌న్ ఉండ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో ర‌జినీతో క‌లిసి త‌న అల్లుడు ధ‌నుష్(Dhanush) స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడ‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. శివ‌రాజ్ కుమార్(Sivaraj kumar), మోహన్‌లాల్(Mohanlal) క్యామియోల‌ను కొన‌సాగిస్తూనే ధ‌నుష్ కోసం ఓ స్పెష‌ల్ క్యారెక్ట‌ర్ ను నెల్స‌న్ డిజైన్ చేశాడ‌ట‌. కొడుకు చ‌నిపోయిన జైల‌ర్‌కు అండ‌గా ఉండే క్యారెక్ట‌ర్ లో ధ‌నుష్ పాత్ర ఉంటుంద‌ని స‌మాచారం.

ఎన్నో ఎలివేష‌న్స్ తో ఆడియ‌న్స్ తో విజిల్స్ వేయించేలా నెల్స‌న్ ఈ సీన్స్ ను రెడీ చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. ధ‌నుష్, ఐశ్వ‌ర్య(Aishwarya) విడిపోయాక ర‌జినీ, ధ‌నుష్ క‌లిసింది లేదు కానీ ర‌జినీకి ధ‌నుష్ పై ఎలాంటి కోపం లేద‌ని ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో బ‌య‌ట‌ప‌డింది. అందుకే జైల‌ర్2 కోసం ధ‌నుష్ ను అనుకుంటున్న‌ట్లు డైరెక్ట‌ర్ చెప్పిన వెంట‌నే ర‌జినీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :