ASBL NSL Infratech

సూర్య క‌థ‌తో మ‌రో హీరో ముందుకెళ్తున్నాడా?

సూర్య క‌థ‌తో మ‌రో హీరో ముందుకెళ్తున్నాడా?

త‌మిళ స్టార్ హీరో సూర్య‌, సుధా కొంగ‌ర కాంబినేష‌న్ లో పురాణ‌నూరు అనే సినిమా అనౌన్స్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆకాశ‌మే నీ హ‌ద్దురా సినిమా త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి చేయ‌నున్న సినిమా కావ‌డంతో అనౌన్స్‌మెంట్ నుంచే దీనిపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ ప్రాజెక్ట్ కార్య‌రూపం దాల్చ‌లేదు. కంగువ త‌ర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంద‌నుకుంటే సూర్య త‌న త‌ర్వాతి సినిమాను కార్తీక్ సుబ్బ‌రాజ్ తో చేస్తున్నాడు. దీంతో పురాణ‌నూరు క్యాన్సిల్ అయింద‌ని తేలిపోయింది. ఇదిలా ఉంటే సుధా కొంగ‌ర ఇప్పుడ‌దే క‌థ‌ను ధ‌నుష్ తో తీయాల‌ని ప్లాన్ చేస్తుంద‌ట‌. రీసెంట్ గా ధ‌నుష్ ను క‌లిసి క‌థ చెప్ప‌గా, ధ‌నుష్ కూడా దానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

ఈ విష‌యంలో క్లారిటీ రావ‌డానికి మ‌రింత టైమ్ ప‌ట్ట‌నుంది. ప్ర‌స్తుతం సుధ కొంగ‌ర బాలీవుడ్ లో అక్ష‌య్ కుమార్ తో ఆకాశ‌మే నీ హ‌ద్దురాని స‌ర్పిరా అనే టైటిల్ తో రీమేక్ చేస్తోంది. నేష‌న‌ల్ అవార్డ్ సినిమా కావ‌డంతో బాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై మంచి అంచ‌నాలున్నాయి. మ‌రోవైపు ధ‌నుష్ కూడా ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.  

 

 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :