ASBL Koncept Ambience
facebook whatsapp X

ఎన్టీఆర్ గెలిచాడు.. నెక్ట్స్ చ‌ర‌ణే!

ఎన్టీఆర్ గెలిచాడు.. నెక్ట్స్ చ‌ర‌ణే!

రాజ‌మౌళి(Rajamouli)తో సినిమా చేసిన ఏ హీరోకైనా ఆ త‌ర్వాతి సినిమా డిజాస్ట‌ర్ అవ‌డం ఓ సెంటిమెంట్ గా మారిపోయింది. జూ. ఎన్టీఆర్(Jr. Ntr) స్టూడెంట్ నెం.1(Student No.)తో మొద‌లైన ఈ సెంటిమెంట్ మొన్న‌టివ‌ర‌కు కొన‌సాగుతూనే వ‌చ్చింది. రామ్ చ‌ర‌ణ్(Ram Charan), ప్ర‌భాస్(Prabhas) సైతం ఈ సెంటిమెంట్ ను త‌ప్పించుకోలేక‌పోయారు. ఇప్పుడు 20 ఏళ్ల త‌ర్వాత ఎన్టీఆరే ఈ సెంటిమెంట్ ను దేవ‌ర(Devara) సినిమాతో బ్రేక్ చేశాడు.

దేవ‌ర స‌క్సెస్ రాజ‌మౌళిపై ఉన్న మ‌చ్చ‌ను పూర్తిగా తొల‌గించింది. మిక్డ్స్ టాక్ తో మొద‌లైన దేవ‌ర సెకండ్ వీక్ లో అడుగుపెట్టే టైమ్‌కు రూ.400 కోట్ల గ్రాస్ ను దాటేసిందంటే మామూలు విష‌యం కాదు. ఈ లెక్క ఎక్క‌డి వ‌ర‌కు వెళ్లి ఆగుతుందో ఇప్పుడే చెప్పలేం. ఆర్ఆర్ఆర్(RRR) హీరోల్లో ఎన్టీఆర్ ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి గెలిచాడు. ఇప్పుడు చ‌ర‌ణ్(Charan) వంతొచ్చింది.

చర‌ణ్ ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఇప్ప‌టికే ఆచార్య(Acharya)లో కొంచెం లెంగ్తీ రోలే చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ అయింది కాబ‌ట్టి జ‌క్క‌న్న(Jakkanna) సెంటిమెంట్ త‌న‌కు వ‌ర్తించ‌ద‌ని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. కానీ చ‌ర‌ణ్ సోలో హీరోగానే దాన్ని బ్రేక్ చేయాల‌ని అది గేమ్ ఛేంజ‌ర్(Game Changer) తోనే చేసి చూపించాల‌ని మ‌రికొంద‌రంటున్నారు. దేవ‌ర కంటే చాలా ముందుగా మొద‌లైన గేమ్ ఛేంజ‌ర్ డిసెంబ‌ర్ లో రిలీజ్ కానుంది. మ‌రి రాజ‌మౌళి సెంటిమెంట్ ను చ‌ర‌ణ్ బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :