ASBL Koncept Ambience
facebook whatsapp X

దేవ‌ర ఆ మ్యాజిక్ చేస్తుందా?

దేవ‌ర ఆ మ్యాజిక్ చేస్తుందా?

నార్త్ ఇండియాలో ఎవ‌రూ ఊహించ‌ని రిజ‌ల్ట్ ను అందుకున్న సౌత్ సినిమాల్లో పుష్ప(Pushpa) ఒక‌టి. బాహుబ‌లి(Baahubali), ఆర్ఆర్ఆర్(RRR) లాంటి సినిమాలు నార్త్ లో బాగా ఆడ‌టం ఆశ్చ‌ర్యం క‌లిగించ‌దు కానీ తెలుగులో డివైడ్ టాక్ తెచ్చుకుని అంచ‌నాల‌కు త‌గ్గ వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేక‌పోయిన ఈ సినిమా, హిందీలో పెద్ద‌గా ప్ర‌చారం లేకుండా విడుద‌లై 80 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ సాధించింది.

పుష్ప నార్త్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యి అంద‌రికీ షాకిచ్చింది. పుష్ప త‌ర్వాత నార్త్ లో స‌ర్ప్రైజ్ హిట్ అంటే కార్తికేయ‌2(Karthikeya2)నే. దీంతో ఇప్పుడు దేవ‌ర(Devara)కు నార్త్ లో ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందో అని అంద‌రూ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. రిలీజ్ కు ముందు దేవ‌ర‌కు హిందీలో బాలీవుడ్ లో పెద్ద‌గా బ‌జ్ లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పెద్ద‌గా జ‌ర‌గ‌లేదు.

కానీ రిలీజ్ రోజు ఈ సినిమాకు వ‌చ్చిన రెస్పాన్స్, క‌లెక్ష‌న్స్ చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చ‌ర్య‌పోతున్నారు. మొద‌టి రోజు హిందీలో దేవ‌ర రూ. 7.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది సినిమాకు ముందున్న బ‌జ్ ప్ర‌కారం చూస్తే పెద్ద నెంబ‌రే మాస్ ఏరియాల్లో సింగిల్ స్క్రీన్స్ లో దేవ‌ర‌కు మంచి రెస్పాన్స్ క‌నిపిస్తుండ‌టం విశేషం. అక్క‌డ సినిమాకు రెస్పాన్స్ బాగుందంటే ముందు ముందు దీనికి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బాగా క‌లిసి రాబోతుంద‌న్న‌మాటే. అక్క‌డి మాస్ ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయితే దేవ‌రకు మంచి క‌లెక్ష‌న్స్ రావ‌డం ఖాయం. చూస్తుంటే పుష్ప మ్యాజిక్‌ను దేవ‌ర రిపీట్ చేసేలానే ఉంది.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :