ASBL Koncept Ambience
facebook whatsapp X

జేక్స్ బిజోయ్ ద‌శ తిరిగిన‌ట్టేనా?

జేక్స్ బిజోయ్ ద‌శ తిరిగిన‌ట్టేనా?

జేక్స్ బిజోయ్ సినిమా మొత్తానికి హీరో ఇంట్రోకి ఇచ్చిన‌ట్లు మ్యూజిక్ ఇచ్చాడు. త‌న వ‌ర్క్ పై ఫుల్ క్యూరియాసిటీతో నేనే స్వ‌యంగా వెళ్లి బీజీఎం వ‌ర్క్ చూశా.. ఆగ‌స్ట్ 29న ఆయ‌న వ‌ర్క్, టాలెంట్ మీరు చూడండ‌ని నేచుర‌ల్ స్టార్ నాని స‌రిపోదా శ‌నివారం ప్ర‌మోష‌న్స్ లో చెప్పాడు. ఇప్పుడు సినిమా రిలీజ‌య్యాక నాని మాట‌లు అక్ష‌రాలా నిజ‌మ‌ని నిరూపించాడు జేక్స్ బిజోయ్.

గురువారం రిలీజైన స‌రిపోదా శ‌నివారం సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకెళ్తున్న విష‌యం తెలిసిందే. నాని యాక్ష‌న్ కి, ఎస్.జె సూర్య విల‌నిజానికి, వివేక్ ఆత్ర‌య వ‌ర్క్ తో పాటూ సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రూ జేక్స్ బిజోయ్ ప‌నిత‌నాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా స‌క్సెస్ లో జేక్స్ కీల‌క పాత్ర పోషించాడు.

సినిమాలో గ్రిప్పింగ్ ఎలివేష‌న్స్ కు జేక్స్ బిజోయ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్ లో ఉంద‌ని మూవీ ల‌వ‌ర్స్ చెప్తున్నారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు అవ‌స‌ర‌మైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వ‌డంలో జేక్స్ త‌న టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడంటున్నారు. స‌రిపోదా శ‌నివారం పాట‌లు అన్ని వర్గాల ఆడియ‌న్స్ ను మెప్పించ‌క‌పోయినా బీజీఎం మాత్రం చూసిన ప్ర‌తి ఒక్క‌రితో ప్ర‌శంస‌లు కురిపించేలా చేస్తోంది. ఈ సినిమా త‌ర్వాత జేక్స్ స్టార్ హీరోల సినిమా ఛాన్సులు అందుకుంటాడని నెటిజ‌న్లు జోస్యం చెప్తున్నారు. మ‌రి ఈ సినిమా స‌క్సెస్ ఆయ‌న్ను ఏ విధంగా తీసుకెళ్తుందో చూడాలి.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :