ASBL Koncept Ambience
facebook whatsapp X

సూర్య‌, కార్తీ ప్లేస్‌లోకి ఎన్టీఆర్, చ‌ర‌ణ్ వ‌చ్చారా?

సూర్య‌, కార్తీ ప్లేస్‌లోకి ఎన్టీఆర్, చ‌ర‌ణ్ వ‌చ్చారా?

కొన్ని కాంబినేష‌న్స్ లో సినిమాలు మ‌నం ఆశ ప‌డ‌ట‌మే కానీ అవి కార్య‌రూపం దాల్చాలంటే చాలా కాల‌మే ప‌డుతుంది. కొన్నిసార్లు అస‌లు అది జ‌ర‌గ‌క పోవచ్చు కూడా. అందుకే దేనికైనా రాసిపెట్టి ఉండాలంటారు పెద్ద‌లు. స‌త్యం సుంద‌రం ప్ర‌మోష‌న్స్ లో భాగంగా హీరో కార్తీ ఈ ఇంట్రెస్టింగ్ విష‌యం గురించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌పెట్టాడు.

త‌ను, త‌న అన్న సూర్య క‌లిసి న‌టించ‌డం లేద‌నే దాని గురించి కార్తీ ఓ విష‌యం చెప్పాడు. కొన్నేళ్ల కింద‌ట ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కార్తీ, సూర్య కాంబోలో ఓ క‌థ చెప్పార‌ని, విన‌డానికి బాగున్న‌ప్ప‌టికీ ఆ సినిమా కార్య‌రూపం దాల్చ‌లేక‌పోయింద‌ని చెప్పాడు. పేరు చెప్ప‌లేదు కానీ దాదాపు అది ఆర్ఆర్ఆర్ అయుంటుంద‌ని కార్తీ మాట‌ల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతుంది.

అయితే ఈ క‌థ వారిద్ద‌రికీ క‌నెక్ట్ అవ‌క‌పోవ‌డానికి కార‌ణముంది. తమిళ ఆడియ‌న్స్ కు పెద్ద‌గా తెలియ‌ని అల్లూరి సీతారామరాజు, కొమ‌రం భీమ్ పాత్ర‌ల్లో క‌నిపిస్తే వారు ఎలా రిసీవ్ చేసుకుంటారనే డౌట్ వ‌చ్చి ఉండొచ్చు. అందుకే ఆ ప్రాజెక్ట్ క‌థ ద‌గ్గ‌రే ఆగిపోయుండొచ్చు. వారు ఆ ప్రాజెక్టుని మిస్ అవ‌డం వ‌ల్లే ఇప్పుడు ఎన్టీఆర్, చ‌ర‌ణ్ కాంబో మ‌నం చూడ‌గ‌లిగాం అని నెటిజ‌న్లు ఈ విష‌యంలో కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా సూర్య‌, కార్తీ మంచి ఛాన్స్ ను మిస్ చేసుకున్నారు.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :