ASBL Koncept Ambience
facebook whatsapp X

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు వెనుక ఇంత జరిగిందా..!?

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు వెనుక ఇంత జరిగిందా..!?

ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఈ సంఘటన అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. చంద్రబాబు అరెస్టు టీడీపీకి ఎన్నికల్లో ఎంతో మేలు చేసింది. అదే సమయంలో ఆయన్ను అరెస్టు చేసిన వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన జగన్ ప్రభుత్వం.. అందుకోసం తెరవెనుక భారీ కుట్ర చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు అరెస్టుకోసం సాక్ష్యాలు మాయం చేయడం, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించడం లాంటివి చేసినట్లు తేలింది.

2014-19 మధ్య చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందుకోసం రెండు ప్రైవేటు సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. 90శాతం ప్రైవేటు సంస్థలు, 10శాతం ప్రభుత్వం నిధులు వెచ్చించేలా డీల్ కుదుర్చుకున్నారు. అందులో భాగంగా ప్రభుత్వ వాటా 10 శాతం నిధులను ఆ సంస్థలకు బదిలీ చేశారు. అయితే ఆ కంపెనీ జీఎస్టీ చెల్లింపులు సరిగ్గా చేయకపోవడంతో ఏపీ ప్రభుత్వానికి ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చాయి. అప్పుడు ఏపీలో చంద్రబాబు ఓడిపోయి జగన్ అధికారంలో ఉన్నారు.

ఐటీ నోటీసులను అధారంగా చేసుకున్న జగన్ ప్రభుత్వం ఆ కంపెనీకి సంబంధించిన షెల్ కంపెనీలను గుర్తించింది. ఇదంతా స్కిల్ డెవలప్మెంట్ స్కాం అని.. ఆ కంపెనీ నుంచి చంద్రబాబుకు, టీడీపీకి, టీడీపీ నేతలకు డబ్బు అందిందని ఆరోపిస్తూ టీడీపీ అధినేతపై సీఐడీ కేసు పెట్టింది. ఈ కేసు విచారణలో భాగంగా అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి పి.వి.రమేశ్ వాంగ్మూలం కూడా తీసుకుంది. ఆయన తన వాంగ్మూలంలో చంద్రబాబు తప్పేం లేదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే నిధులు చెల్లించినట్లు వెల్లడించారు. ఇంతలో పి.వి.రమేశ్ రిటైర్డ్ అయిపోయారు.

వాస్తవానికి పి.వి.రమేశ్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా చంద్రబాబును అరెస్టు చేసేందుకు వీలుండదు. అందుకే పి.వి.రమేశ్ పదవీ విరమణ చేయగానే ఆయన వాంగ్మూలాన్ని సీఐడీ తమకు అనుకూలంగా మార్చేసుకుంది. అంతేకాక.. అందుకు అనుగుణంగా కొన్ని ఆధారాలను కూడా సృష్టించింది. స్కిల్ డెవలప్మెంట్ ఒప్పందాలకు సంబంధించిన డాక్యమెంట్లను మాయం చేసేసింది. దీంతో పి.వి.రమేశ్ వాంగ్మూలాన్ని ఆధారంగా చంద్రబాబును అరెస్టు చేసింది. ఆ తర్వాత చంద్రబాబు 53 రోజులు జైలు శిక్ష అనుభవించారు. తర్వాత బయటికొచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించారు.

ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. అందులో భాగంగానే ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చంద్రబాబు చేయని పనులను చేసినట్లు ఆధారాలు సృష్టించారు. పి.వి.రమేశ్ వాంగ్మూలాన్ని పూర్తిగా వాళ్లకు అనుకూలంగా మార్చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఏం చేయాలనేదానిపై చంద్రబాబు ప్రభుత్వం న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. తన వాంగ్మూలాన్ని మార్చేయడంపై పి.వి.రమేశ్ కోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. ఇదంతా నాటి సీఎంఓలో ఉన్న కొంతమంది పెద్దలు, అధికారుల కేంద్రంగానే జరిగిందని ఇప్పటి ప్రభుత్వం గుర్తించింది. విశేషం ఏంటంటే.. నాడు కుట్ర చేసిన కొంతమంది అధికారులు ఇప్పటికీ కీలక పదవుల్లో ఉన్నారు. మరి వాళ్లపై చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది వేచి చూడాలి.


 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :