ASBL Koncept Ambience
facebook whatsapp X

బెల్లంబాబు కొత్త సినిమాకు భ‌లే టైటిల్

బెల్లంబాబు కొత్త సినిమాకు భ‌లే టైటిల్

మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ వ‌రుస సినిమాల‌ను లైన్ లో పెట్టాడు. బాలీవుడ్ లో ఛ‌త్ర‌ప‌తి రీమేక్ కోసం ఎంతో టైమ్ ను వేస్ట్ చేసుకున్న శ్రీనివాస్ ఇప్పుడు సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో టైస‌న్ నాయుడు అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాతో పాటూ లుదీర్ భైరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ థ్రిల్ల‌ర్ సినిమా కూడా చేస్తున్నారు.

ఈ రెండు సెట్స్ పై ఉండ‌గానే బెల్లం బాబు విజ‌య్ క‌న‌క‌మేడ‌ల‌తో మ‌రో సినిమాకు క‌మిట్ అయినట్లు స‌మాచారం. నాంది సినిమాతో డైరెక్ట‌ర్ గా ప‌రిచ‌య‌మై మంచి హిట్ అందుకున్న ఆ త‌ర్వాత మ‌ళ్లీ న‌రేష్ తోనే ఉగ్రం తీసి డిజాస్ట‌ర్ అందుకున్నాడు. దీంతో కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు త‌మిళ హిట్ సినిమా గ‌రుడ‌న్ ను రీమేక్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ తో పాటూ నారా రోహిత్, మంచు మ‌నోజ్ లీడ్ రోల్స్ లో క‌నిపించ‌నున్నార‌ట‌. ఈ సినిమాకు వీర ధీర శూర అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. ముగ్గురు స్నేహితుల క‌థ‌తో రూపొందుతున్న ఈ సినిమాలో మనోజ్ పాత్ర కాస్త నెగిటివ్ షేడ్స్ లో ఉంటుంద‌ని తెలుస్తోంది. త‌రుళంలో సూప‌ర్ హిట్ అయిన గ‌రుడ‌న్ కు కొన్ని మార్పులు చేసి మ‌న నేటివిటీకి త‌గ్గట్టు విజ‌య్ ప్రెజెంట్ చేయ‌నున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాపై అధికారిక ప్ర‌క‌ట‌న రానున్నట్లు స‌మాచారం.  

 

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :