ASBL NSL Infratech

యూనిక్ ఎంట‌ర్‌టైన‌ర్ థ్రిల్ల‌ర్‌గా యేవ‌మ్ అంద‌ర్ని అల‌రిస్తుంది : ద‌ర్శ‌కుడు ప్ర‌కాష్ దంతులూరి

యూనిక్ ఎంట‌ర్‌టైన‌ర్ థ్రిల్ల‌ర్‌గా యేవ‌మ్ అంద‌ర్ని అల‌రిస్తుంది : ద‌ర్శ‌కుడు ప్ర‌కాష్ దంతులూరి

చాందిని చౌద‌రి, వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్‌,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం యేవ‌మ్‌. ప్రకాష్‌ దంతులూరి . దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌కాష్ దంతులూరి బుధ‌వారం మీడియాతో ముచ్చ‌టించారు. ఆ విశేషాలివి.

మీ నేప‌థ్యం ఏమిటి?

సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా నా కెరీర్ ప్రారంభ‌మైంది. ఓ టైమ్‌లో హిందీలో ల‌గాన్‌,  తెలుగులో ఖుషి సినిమాలు న‌న్ను ద‌ర్శ‌కుడిగా మార‌డానికి ప్రేర‌ణ ఇచ్చాయి. అందుకే యూఎస్‌లో రిజైన్ చేసి ఇండియాకు వ‌చ్చాను. ఆ స‌మ‌యంలో నేను రాసుకున్న ఓ  క‌థ ప్రియాంక ద‌త్ గారికి వినిపించాను. అశ్వ‌నీద‌త్ గారు కూడా క‌థ విని నాకు ద‌ర్శ‌క‌త్వం అవ‌కాశం ఇచ్చారు. నా తొలిసినిమా వైజ‌యంతీ మూవీస్‌లో ఓంశాంతి సినిమా చేశాను. ఈ సినిమా త‌రువాత నా బిజినెస్‌ల్లో బిజీగా అవ్వ‌డం వ‌ల్ల చాలా గ్యాప్ తీసుకున్నాను. కోవిడ్ గ్యాప్‌లో మ‌ళ్లీ సినిమా చేయాల‌ని అనిపించింది. అనుకోకుండా  న‌వ‌దీప్‌ను క‌ల‌వ‌డం  ఆస‌మ‌యంలోనే సీస్పెస్ పెట్ట‌డం, ఆ టైమ్‌లో క‌లుసుకున్నాను. న‌వ‌దీప్‌కు కాన్సెప్టు న‌చ్చి ఈ సినిమాకు నిర్మాత‌గా మారాడు.

యేవ‌మ్ టైటిల్ జ‌స్టిఫికేష‌న్ ఏమిటి?

యేవ‌మ్ అనేది సంస్కత ప‌దం, ఇతిహాసాలు, పురాణాలు చెప్పిన‌ప్పుడు ఇది ఇలా జ‌రిగింది అని చెప్ప‌డాన్నియేవ‌మ్ అంటారు. ఈ సినిమాలోని పాత్ర‌లు రియ‌ల్‌లైఫ్ పాత్ర‌ల్లా వుంటాయి. న‌లుగురు విభిన్న‌మైన వ్యక్తుల క‌థ ఇది. వంశీ అన్వేష‌ణ లాంటి థ్రిల్ల‌ర్‌ను మ‌న‌కు తెలిసిన పాత్ర‌ల‌తో చెబితే ఎలా వుంటుంది అనేది యేవ‌మ్‌.

ఎవ‌రికి తెలియ‌ని ఈ టైటిల్ పెట్ట‌డం రిస్క్ అనిపించ‌లేదా?

ఈ టైటిల్ అర్థం ఎవ‌రికి తెలియ‌నిది అని తెలుసు. కానీ క‌థ‌కు ఇదే యాప్ట్ టైటిల్‌. ఒక్క‌సారి సినిమా చూసిన త‌రువాత ఈ టైటిల్ గురించి అర్థం అవుతుంది. టైటిల్ గురించి ఇంత డిస్క‌ష‌న్ జ‌ర‌గ‌డం కూడా మాకు ప్ల‌సే అవుతుంది.

యేవ‌మ్ పోలీసాఫీస‌ర్ క‌థ అనుకోవ‌చ్చా?

పోలీసాఫీస‌ర్ క‌థ అయినా చాలా ఎంట‌ర్‌టైనింగ్ థ్రిల్ల‌ర్ ఇది. ప‌త్రి పాత్ర కూడా ఎంతో యూనిక్‌గా వుంటుంది. సినిమా మొత్తం సీరియ‌స్ మూడ్‌లో వుండ‌దు. ప్ర‌తి స‌న్నివేశాన్నిఆడియ‌న్స్ ఎంజాయ్ చేస్తారు.

ఈ సినిమా క‌థ‌కు మూలం ఏమిటి?

నేటి స‌మాజంలోని వ్య‌క్తుల‌ను చూసి రాసుకున్న పాత్ర‌లే ఇవి. ప్ర‌తి ఒక్క‌రికి జీవితంలో కొన్ని ల‌క్ష్యాలుంటాయి. ఆ ల‌క్ష్యాల‌ను చేదించ‌డానికి వాళ్లు ప‌డే స్ట్ర‌గుల్ ఈ క‌థ‌. అయితే  చిత్రంలో ఓ అమ్మాయి త‌ను అనుకున్న గోల్‌ను ఎలా చేరుకుంది అనేది ఎంతో ఆస్త‌కిక‌రంగా ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది. స‌మాజంలోని పాత్ర‌లు, నా మైండ్‌లో రిజిస్ట‌ర్ అయిన పాత్ర‌ల్లోంచి వ‌చ్చిందే యేవ‌మ్

ఈసినిమాలోని పాత్ర‌ల  గురించి?

ఈ సినిమాలో పాత్ర‌ల గురించి చెబితే క‌థ తెలిసిపోతుంది. అందుకే పూర్తిగా చెప్ప‌లేం. కానీ క్యారెక్ట‌ర్స్‌ను ఒక పోస్ట‌ర్ ద్వారా వాళ్ల పాత్ర‌ల‌ను తెలియ‌జేశాం. ఇంత‌కంటే ఎక్కువ చెబితే క్యారెక్ట‌ర్‌లోని కిక్ పోతుంది.

చాందిని చౌద‌రి పాత్ర ఎలా వుంటుంది?

చాందిని చౌద‌రి సౌమ్య పాత్ర‌లో లీన‌మైపోయింది. ప్ర‌తి స‌న్నివేశం బాగా చేసింది. ఆమెకు న‌టిగా మంచి పేరును తీసుక‌వ‌స్తుంది.

ఈ సినిమాకు నేప‌థ్యం సంగీతం ఎంత వ‌ర‌కు ప్ల‌స్ అవుతుంది?

నేప‌థ్య సంగీతం క‌థను  చెప్పాలి. క‌థ‌ను ఇబ్బంది పెట్ట‌కూడ‌దు. ఈ సినిమాకు ఫీమేల్ సంగీత ద‌ర్శ‌కురాలు నేప‌థ్య సంగీతం అందించింది. చాలా బాగా చెసింది. నేప‌థ్య సంగీతం క‌థ‌లోని ఎమోష‌న్స్ చెబుతుంది.

ఈ సినిమాను థియేట‌ర్‌లోనే ఎందుకు చూడాలి?

ఈ సినిమా మేమే థియేట‌ర్ కోసం చేసింది. టెక్నిక‌ల్‌గా కూడా థియేట్రిక‌ల్ ఎక్స్ పీరియ‌న్స్ కోసం తీశాం. ఇది థియేట‌ర్‌లో చూడ‌ద‌గ్గ సినిమా.సినిమాను  థియేట‌ర్‌లో చూసిన ఫీల్ ఓటీటీలో రాదు. థియేటిక్ర‌ల్ ఎక్స్‌పీరియ‌న్స్ బెట‌ర్ దెన్ ఓటీటీ

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :