Bhacchala Malli : బచ్చల మల్లి' క్యారెక్టర్ బేస్డ్ మూవీ : డైరెక్టర్ సుబ్బు మంగాదేవి
హీరో అల్లరి నరేష్ (Allari Naresh) అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'. (Bhacchala Malli )సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత అయ్యర్ (Amrutha Ayyar )హీరోయిన్ గా నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలై టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సుబ్బు మంగాదేవీ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
'బచ్చల మల్లి' ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది ?
-నిర్మాత రాజేష్ గారు నాకు ముందు నుంచి ఫ్రెండ్. రాజేష్ గారికి ముందుగా ఈ కథ చెప్పాను. ఆయనకి నచ్చింది. తర్వాత నరేష్ గారికి చెప్పమన్నారు. నరేష్ గారు సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేశారు. కథ విన్న వెంటనే సినిమా చేసేద్దామని చెప్పారు.
హీరో క్యారెక్టర్ ఎలా వుంటుంది ?
-మూర్ఖత్వం బోర్డర్ దాటేసిన క్యారెక్టర్. అందరిలో మూర్ఖుడు వుంటారు. కానీ అతనిలో ఈ మోతాదు ఎక్కువ. అది ఎంత ఎక్కువ అనేది ఎస్టాబ్లెస్ చేయడానికి టీజర్ లో పిల్లల చందాల బాక్సు కూడా ఎత్తుకెళ్ళే సీన్ చూపించాం. అలా ఎత్తుకెళ్ళి ఏం చేశాడనేది సినిమాలో చూసినప్పుడు చాలా హై ఇస్తుంది.
ఇందులో బచ్చల మల్లి క్యారెక్టర్ గెటప్, లుక్ కి పుష్పతో పోలిక కనిపించింది కదా?
-ఈ పోలిక రావడానికి కారణం వుంది. పుష్ప పార్ట్ 1 హీరోది కూలీ క్యారెక్టర్. బచ్చల మల్లి ట్రాక్టర్ డ్రైవర్. వీళ్ళంతా దాదాపుగా ఒకే ఛాయలో వుంటారు. సాఫ్ట్ వేర్ అనగానే డీసెంట్ గెటప్, లుక్ వుంటుంది. అలాగే ఊర్లో పొలం పనులు పనిచేసేవాళ్ళ దాదాపు ఒకేలా వుంటారు. అలా గెటప్ విషయంలో కంపారిజన్ వచ్చింది తప్పా మరొకటి కాదు.
ఇది నిజజీవిత కథ ఆధారంగా రాసుకున్నారా?
-లేదండి. బచ్చల మల్లి అనే క్యారెక్టర్ వున్న మాట వాస్తవమే. చిన్నప్పుడు ఆ క్యారెక్టర్ గురించి వినేవాళ్ళం. ఊరు గురించి నిలబడిన హీరోయిక్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ వైబ్ తో కేవలం టైటిల్ మాత్రమే పెట్టాం తప్పా ఇది ఆయన కథ కాదు.
90 నేపధ్యం తీసుకోవడానికి కారణం ?
-కథని ఎమోషనల్ గా చెప్పాలని అనుకున్నాం. అలాగే ఇందులో ఒక మంచి ప్రేమ కథ వుంది. ఇప్పుడు ప్రేమకథ చెప్పాలంటే వేరే జోన్ లో చెప్పాలి. ఇప్పుడు మనుషులతో నేరుగా మాట్లాడటమే తగ్గిపోయింది. సోషల్ మీడియాలోనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎమోషనల్ లవ్ స్టోరీలు తగ్గిపోయాయి. పైగా నేను 90లోనే ఊర్లో పెరిగాను. అప్పటి మనుషులు ఎలా ప్రవర్తించేవారు నాకు తెలుసు. అందుకే కథని ఆ జోన్ లో చెప్పాలని అనుకున్నాను.
-ఇది క్యారెక్టర్ బేస్డ్ కథ. ఇందులో ఫాదర్ ఎమోషన్ కూడా మెయిన్ గా వుంటుంది. వెనక్కి వెళ్లి సరిదిద్దుకోలేని తప్పులు మూర్ఖత్వంతో చేయోద్దనే థీంతో ఈ కథ చెప్పడం జరిగింది. టీజర్ ఈవెంట్ లో చెప్పిననట్లు నా లైఫ్ లో నా మదర్ ని కోల్పోయాను. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఎదో ఒక మిస్టేక్ జరుగుతూ వుంటుంది. దయచేసి ఆ మూమెంట్ ని చెక్ చేసుకోండి. బాధపడటం తప్పా మళ్ళీ వెనక్కి వెళ్లి సరిదిద్దుకోలేరు. ఆ పాయింట్ ని చెప్పడానికి ఈ క్యారెక్టర్ ఇలా అల్లుకోవడం జరిగింది. ఈ కథని చాలా నిజాయితీగా చెప్పా.
అల్లరి నరేష్ గారి పెర్ఫార్మెన్స్ గురించి ?
-అల్లరి నరేష్ గారు వండర్ ఫుల్ యాక్టర్. ఆయన అన్ని రకాల పాత్రలని అద్భుతంగా చేయగలరు. శంభో శివ శంభో, విశాఖ ఎక్స్ ప్రెస్, గమ్యం ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలని ఆయన మొదటి నుంచి చేస్తూ వస్తున్నారు. బచ్చల మల్లి క్యారెక్టర్ ఆయనకి ఫస్ట్ అఫ్ ఇట్స్ కైండ్ లా వుంటుంది. క్యారెక్టర్ కి పూర్తి న్యాయం చేశారు.
విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ గురించి ?
-కృష్ణగాడి వీర ప్రేమ గాధ నుంచి విశాల్ తో వర్క్ చేయాలని అనుకుంటున్నాను. పడిపడి లేచే మనసు, సీతారామం లాంటి అద్భుతమైన ఆల్బమ్స్ ఇచ్చారు. బచ్చల మల్లి సాంగ్స్ కథలో బాగంగా వుంటాయి. నాలుగు పాటలూ ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి.
స్క్రీన్ ప్లే ఎలా వుండబోతుంది ?
-నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే వుంటుంది. కథ ప్రెజెంట్ నుంచి పాస్ట్ కి వెళుతుంది. ఎక్కడా కన్ఫ్యుజన్ వుండదు. డైలాగ్స్ కూడా చాలా సహజంగా వుంటాయి.
షూటింగ్ విషయంలో ఎలాంటి సవాళ్ళు ఎదురుకున్నారు?
-తుని దగ్గర మేజర్ గా షూట్ చేశాం. ఛాలెంజ్ అంటే ఫోన్స్ కనపడనీయకుండా చూడాలి. షూట్ చేస్తుంటే బ్యాక్ గ్రౌండ్ లో అలవాటు ప్రకారం ఎవరో ఫోన్ మాట్లాడుతుంటారు. ఆ విషయంలో కేర్ తీసుకోవడం ఒక ఛాలెంజ్ అనిపించింది. సెట్ లో చేసే అన్నీ మన కంట్రోల్ లో వుంటాయి. ఈ సినిమా దాదాపు లైవ్ లొకేషన్స్ లో చేయడం జరిగింది.
అమృత అయ్యర్ క్యారెక్టర్ ఎలా వుంటుంది ?
-అమృత అయ్యర్ క్యారెక్టర్ గుర్తుండిపోయేలా వుంటుంది. ఎమోషనల్ అండ్ లవ్లీ గా వుండే క్యారెక్టర్. చాలా బావుంటుంది.
-రావు రమేష్ గారిది చాలా ఇంపార్టెంట్ రోల్. అచ్యుత్ కుమార్ గారి పాత్ర కూడా కీలకంగా వుంటుంది.
నిర్మాత రాజేష్ దండా గురించి ?
-రాజేష్ గారు కథని బలంగా నమ్మారు. రెగ్యులర్ గా కాకుండా కొత్తగా ఈ కథని చెప్పాలని అనుకున్నాం. దీనికి నమ్మకాన్ని ఇచ్చిన వ్యక్తి రాజేష్ గారు. చాలా సపోర్ట్ చేశారు.
కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?
-ఒక స్టొరీ లైన్ వుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత దానిపై ద్రుష్టి పెడతాను.