ASBL Koncept Ambience
facebook whatsapp X

విజ‌య్‌ను మా వాడు అంటున్న త్రివిక్ర‌మ్..

విజ‌య్‌ను మా వాడు అంటున్న త్రివిక్ర‌మ్..

టాలీవుడ్ లో ఎంతో ఫాస్ట్ గా స్టార్ స్టేట‌స్ తెచ్చుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌(Vijay Devarakonda). పెళ్లి చూపులు(Pelli Choopulu), అర్జున్ రెడ్డి(Arjun Reddy), గీత గోవిందం(Geetha Govindam), ట్యాక్సీవాలా(Taxiwala) లాంటి సినిమాల‌తో విజ‌య్ పేరు ఒక‌ప్పుడు బాగా వినిపించింది. కానీ త‌ర్వాత విజ‌య్ ను వ‌రుస‌గా ఫ్లాపులు వెంటాడుతున్నాయి. త‌ను ఎంతో న‌మ్మిన లైగ‌ర్(Liger), ఫ్యామిలీ స్టార్(Family Star) సినిమాలు డిజాస్ట‌ర్ అవ‌డం విజ‌య్ మార్కెట్ ను బాగా దెబ్బ‌తీశాయి.

దీంతో విజ‌య్ మునుప‌టి కంటే కాస్త డ‌ల్ అయిన‌ట్లు క‌నిపిస్తున్నాడు. రీసెంట్ గా లక్కీ భాస్క‌ర్(Lucky Bhaskar) ఈవెంట్ కు గెస్టు గా వ‌చ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఎప్ప‌టిలా హుషారుగా క‌నిపించ‌లేదు. విజ‌య్ మాట‌ల్లో చురుకుద‌నం లేదు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్(Trivikram) విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు మంచి బూస్ట‌ప్ ఇచ్చాడు.

ల‌క్కీ భాస్క‌ర్ ఈవెంట్ లో త‌న స్పీచ్ లో భాగంగా స్పెష‌ల్ గా విజ‌య్ గురించి మాట్లాడి త‌న‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకున్నాడు త్రివిక్ర‌మ్. త‌న‌కు విజ‌య్ న‌ట‌న ఎంతో న‌చ్చుతుంద‌ని, త‌క్కువ టైమ్ లో ఆడియ‌న్స్ నుంచి ఎంత ప్రేమ‌ను చూశాడో అంత‌కు డ‌బుల్ ద్వేషాన్ని కూడా ఎదుర్కొన్నాడ‌ని కానీ విజ‌య్ వాట‌న్నింటినీ త‌ట్టుకున్నాడ‌ని, "మా వాడు చాలా గ‌ట్టివాడు" అని విజ‌య్ ని కౌగిలించుకోవడంతో ఒక్క‌సారిగా అంద‌రూ ఎమోష‌న‌ల్ అయ్యారు. సోష‌ల్ మీడియాలో విజ‌య్ పై వ‌చ్చిన‌ నెగిటివిటీని గుర్తించే త్రివిక్ర‌మ్ ఇలా మాట్లాడాడ‌ని, త్రివిక్ర‌మ్ లాంటి డైరెక్ట‌ర్ స్ట్ర‌గుల్ లో ఉన్న హీరోకు ఇలా బూస్ట్ ఇవ్వ‌డం ఎంతో గొప్ప విష‌య‌మ‌ని అంద‌రూ అభిప్రాయ‌ప‌డుతున్నారు.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :