Pushpa2: పుష్ప2 డే1 ఎంత తెస్తాడు?
ఏదైనా భారీ పాన్ ఇండియా సినిమా రిలీజవుతున్నప్పుడు దాని ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి? ఆ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టించనుందనే దానిపై చర్చ జరగడం కామన్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్(Sukumar) దర్శకత్వంలో రూపొందిన పుష్ప2(Pushpa2) సినిమాపై ఎలాంటి హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రూ.1000 కోట్లకు పైగా బిజినెస్ చేసిన పుష్ప2 కలెక్షన్ల పరంగా కూడా ఆ మార్కును ఈజీగా అందుకుంటుందని అందరూ ఆశిస్తన్నారు. ఇక్కడ పుష్ప2 కు బాగా కలిసొస్తున్న విషయం నార్త్ లో విపరీతమైన హైప్ తెచ్చుకోవడమే. బాహుబలి2(Baahubali2) తర్వాత పుష్ప2 కే అంత హైప్ వచ్చింది. ఈ సినిమా కోసం నార్త్ ఆడియన్స్ ఓ రేంజ్ లో ఊగిపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రికార్డు బ్రేకింగ్ టికెట్ రేట్స్ తో రిలీజవుతున్న పుష్ప తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూడా మంచి హైప్ తో రిలీజ్ అవుతుంది. చూస్తుంటే పుష్ప2కు ఓపెనింగ్స్ కౌంట్ రూ.200 కోట్లతో మొదలయ్యేట్టు అనిపిస్తుంది. నిజంగా ఆ స్థాయిలో పుష్ప2 కలెక్ట్ చేస్తే మాత్రం ఇండియన్ సినిమాలో ఇది ఓ కొత్త రికార్డు క్రియేట్ చేసినట్టే అవుతుంది.